
బీజేపీతోనే సామాజిక న్యాయం
సుభాష్‌నగర్: అన్ని వర్గాల సంక్షేమమే బీజేపీ లక్ష్యమని, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అ న్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయ న మాట్లాడారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ఇచ్చి, రిజర్వేషన్లు మైనారిటీలకు అమలుచేయడం మోసం చే యడం కాదా అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ బీసీల కోసం ఏం చేశారో చె ప్పాలన్నారు. రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఈనెల 15 వరకూ జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. నాయకులు లక్ష్మీనారాయణ, గంగాధర్, శ్రీనివాస్, ఆశన్న, నారాయణ యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, జగన్‌రెడ్డి, విజయ్‌కుమార్, రాంచందర్, శంకర్, సంతోష్,ముత్యాలు, మల్లేష్ ఉన్నారు.
తెలుగులో బాలామణికి డాక్టరేట్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ వ ర్సిటీ తెలుగు విభాగం పరిశోధక విద్యార్థిని బాలామణి పీహెచ్‌డీ డాక్టరేట్ సాధించారు. తె యూ తెలుగు విభాగం అధ్యాపకులు సీహెచ్ లక్ష్మణ చక్రవర్తి పర్యవేక్షణలో ‘ముదిగొండ వీరభద్రయ్య సాహిత్య విమర్శ– సమగ్ర పరిశీలన’ అనే అంశంపై బాలామణి పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వారిజారాణి గురువారం తెయూలో ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా హాజరై, పరిశోధకురాలిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.

బీజేపీతోనే సామాజిక న్యాయం