
అలుగు పారుతున్న చెరువులు
మోపాల్/ నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని కాల్పోల్ ఊర చెరువు అలుగు పారుతోంది. గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు అటవీ ప్రాంతాల గుండా వరద చెరువులోకి వచ్చి చేరుతోంది. అదే విధంగా మంచిప్ప పెద్ద చెరువుతోపాటు బాడ్సి, కంజర్, ముదక్‌పల్లి, సిర్‌పూర్, తదితర చెరువుల్లోకి కూడా వరద వచ్చి చేరుతోంది. ఊర చెరువు అలుగు పారడంతో అటవీ ప్రాంతంలో ఉన్న కాల్పోల్ వాటర్ ఫాల్స్ సందడిగా మారనుంది. రూరల్ మండలంలోని మల్కాపూర్ తండా చెరువు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిండుకుండలా మారి అలుగు పారుతోంది. దీంతో గ్రామస్తులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.