
వర్సిటీ హాస్టల్ డిపాజిట్ ఫీజు తగ్గించాలి
తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్రంలో ఏ ఇతర యూనివర్సిటీల్లో లేని విధంగా తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్ డిపాజిట్ ఫీజులు ఆకాశన్నంటుతున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్ విమర్శించారు. శుక్రవారం తెయూ న్యూబాయ్స్ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు రూ.10 వేలు, నాన్ స్కాలర్‌షిప్, ఓసీ విద్యార్థులకు రూ.18వేల చొప్పున డిపాజిట్ వసూలు చేస్తున్నారన్నారు. వెంటనే వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజు, వర్సిటీ అధ్యక్షుడు జీషన్, ఉపాధ్యక్షులు నాగేంద్ర, నిరంజన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.