
చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ రూరల్: చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర చేనేత గౌరవ అధ్యక్షుడు చెలివేరి గణేశ్ అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని చేనేత సహకార సంఘం భవనంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. చేనేత కార్మికులకు తక్కువ ధరకే వారు తయారు చేసే మెటీరియల్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుతాన్ని ఆయన కోరారు. అంతకుమందు పలువురు చేనేత కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిలివేరి శంకర్, రాష్ట్ర సలహాదారులు కొండి రమేశ్, బీమర్తి రవి, బొట్టు వెంకటే్‌శ్, కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.