
వైభవంగా వరలక్ష్మి వ్రతశోభ
నిజామాబాద్ రూరల్/ డిచ్‌పల్లి: వరాలను అందించే వరలక్ష్మి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ఆడపడుచులు వైభవంగా వరలక్ష్మి వ్రతాలు చేశారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పలు ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక వ్రతాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, శివాజీనగర్‌లో ఉన్న గీత ఆలయం, న్యాల్‌కల్ రోడ్డులో ఉన్న లలితాదేవి ఆలయం, దుబ్బలో ఉన్న మహాలక్ష్మి ఆలయం, కోటగల్లిలో ఉన్న మార్కండేయ మందిరం, నల్లపోచమ్మ ఆలయం, వినాయక్‌నగర్‌లో ఉన్న భూలక్ష్మి ఆలయం, మారుతినగర్, నాందేవాడలో ఉన్న అమ్మవారి ఆలయాల్లో, డిచ్‌పల్లి మండల కేంద్రంలో, పోలీస్ బెటాలియన్‌లోని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

వైభవంగా వరలక్ష్మి వ్రతశోభ

వైభవంగా వరలక్ష్మి వ్రతశోభ

వైభవంగా వరలక్ష్మి వ్రతశోభ

వైభవంగా వరలక్ష్మి వ్రతశోభ

వైభవంగా వరలక్ష్మి వ్రతశోభ

వైభవంగా వరలక్ష్మి వ్రతశోభ