
హరిచరణ్‌లో జీవన్ దాత వందన ఉత్సవం
నిజామాబాద్ రూరల్: మార్వాడీ యువ మంచ్ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో హరిచరణ్ మార్వాడీ హిందీ విద్యాలయంలో ‘జీవన్ దాత వందన ఉత్సవం’ నిర్వహించారు. స్కూల్‌లో విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలు కడిగి వారిని నమస్కరించారు. అనంతరం దుబ్బా ప్రాంతంలోని అక్షరధామ్ స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో మార్వాడీ యువ మంచ్ అధ్యక్షుడు సందీప్ సార్డా, అఖిల భారతీయ మార్వాడీ యువ మంచ్ జాతీయ అధ్యక్షుడు సురేశ్ ఎం జైన్, ఆంధ్రా–తెలంగాణ మార్వాడీ యువ మంచ్ ప్రాంతీయ అధ్యక్షుడు మనీష్ నహర్, శ్రీకాంత్ ఝన్వర్, ఉదయ ఉపాధ్యాయ్, అనురాగ్ భంగడియా, రాఘవ ఉపాధ్యాయ్ పాల్గొన్నారు.