
నగరంలో కుండపోత
నిజామాబాద్ నగరంలో గురువారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు భారీగా నిలిచిఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దుబ్బ నుంచి ఖానాపూర్‌కు వెళ్లే దారిలో, ఆదర్శనగర్, గౌతమ్‌నగర్, ఎన్జీవోస్ కాలనీ, జన్మభూమిరోడ్డులోని పలు కాలనీలు, రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్‌కు వెళ్లే దారిల్లో రోడ్లపై వర్షపునీరు, మురికినీరు నిలిచాయి. అరుంధతినగర్‌లో ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్