
ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): అధిక దిగుబడి, మంచి మ ద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్‌పామ్ పంటను సాగు చేసేందుకు జిల్లా లోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్ట ర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా, సహకార సంఘం ఎరువుల గోడౌన్ వద్ద స్థానిక రైతులతో భేటీ అయ్యారు. ఆయిల్‌పామ్ సాగు చేపట్టిన నూత్‌పల్లి గ్రామ ఆదర్శ రైతు గోపిడి గంగారెడ్డి క లెక్టర్ సమక్షంలో తన స్వీయ అనుభవా లను తో టి రైతులకు తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడు తూ.. గంగారెడ్డిని అభినందించారు. ఇతర రైతు లు కూడా ఇదే స్ఫూర్తితో ఆయిల్‌పామ్ సాగును చేపట్టి ఆర్థిక పరిపుష్టి సాధించాల ని అన్నారు. ఈ పంట సాగుకు జిల్లాలో అనుకూ ల పరిస్థితులు ఉన్నాయని, ప్రభుత్వం పెద్ద ఎత్తు న రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తోందని వివరించారు. సాగుకు ముందుకు వచ్చే రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామన్నారు.