రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Published Mon, Nov 27 2023 12:46 AM

- - Sakshi

మాచారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఘన్‌పూర్‌ శివారులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరం గ్రామానికి చెందిన పంతం సుమన్‌(35) సొంత పనినిమిత్తం మాచారెడ్డికి వచ్చాడు. తిరిగి రాత్రి స్వగ్రామానికి వెళ్తుండగా ఘన్‌పూర్‌ శివారులో బైక్‌ అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం స్థానికులు 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం

నిజాంసాగర్‌(జుక్కల్‌): మండలంలోని మల్లూర్‌ శివారులో రెండు ట్రాన్స్‌ ఫార్మర్లలను దుండగులు శనివారం రాత్రి ధ్వంసం చేసి కాపర్‌వైర్లు, ఆయిల్‌ను చోరీ చేశారు. రెండు ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసంతో సుమారు. రూ. లక్ష నష్టం కలిగినట్లు బాధిత రైతులు తెలిపారు. ట్రాన్స్‌కో అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement