పట్టణవాసి.. ఎందుకీ లేజీ..! | - | Sakshi
Sakshi News home page

పట్టణవాసి.. ఎందుకీ లేజీ..!

Jul 27 2026 11:49 PM | Updated on Jul 27 2026 11:49 PM

9లోu మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

‘సర్‌’లో అర్బన్‌ ఓటర్ల నిర్లక్ష్యం ప్రక్రియ పూర్తికి వారమే గడువు.. పట్టణాల్లో వేలసంఖ్యలో పెండింగ్‌ 14 మండలాల్లో వందశాతం డిజిటలైజేషన్‌ జిల్లాలో లక్షకు పైగా ఓట్లు పోయినట్లే..!

నిర్మల్‌

స్వయం ఉపాధిలో అతివ

స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరిన మహిళలు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

బాసరలో వ్యాసపౌర్ణమి ఉత్సవాలు

బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వ్యాస పౌర్ణమి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.

మెరుగైన వైద్యసేవలు

అందించాలి

భైంసాటౌన్‌: ముధోల్‌ నియోజకవర్గ ప్రజ లకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామారావు పటేల్‌ సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను కోరారు. హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రికి విన్నవించారు. భైంసా ఏరియా ఆస్పత్రిని 150 పడకలకు పెంచాలని, డయాలసిస్‌ పడకలు పెంచాలని, వంద పడకలతో మెటర్నటీ ఆస్పత్రి నిర్మించాలని, కుభీర్‌ ఆస్పత్రిని 30 పడకలకు పెంచాలని, ముధోల్‌ ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తి చేయాలని విన్నవించారు. అన్ని ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, స్టాఫ్‌ నర్స్‌, ఇతర పోస్టులు భర్తీ చేయాలన్నారు. కుభీర్‌, బాసరతో పాటు భైంసాకు అదనంగా అంబులెన్స్‌ కేటాయించాలని కోరారు.

నిర్మల్‌: పట్టణ ప్రాంత ప్రజలు ప్రతీ విషయంలో ముందుంటారనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ.. చాలా విషయాల్లో అది తప్పవుతోంది. ప్రధానంగా ఓటు వేయడం, ఓట్లను కాపాడుకోవడం వంటి ముఖ్యమైన విషయాల్లోనూ ఇదే పరిస్థితి. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–ఎస్‌ఐఆర్‌) విషయంలో జిల్లాలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల ప్రజలు వెనుకంజలో ఉన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ముగియడానికి మరో వారమే గడువు ఉండగా, జిల్లాలోని నిర్మల్‌, భైంసా మున్సిపాలిటీలలో కలిపి ఇప్పటికీ వేలసంఖ్యలో ఎన్యూమరేషన్‌ ఫారాలు బీఎల్‌వోలకు తిరిగి చేరకపోవడం గమనార్హం.

వెనుకంజలో నిర్మల్‌, భైంసా..

జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో గణనీయ సంఖ్యలో ఓటర్లు ఇంకా ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించలేదు. ఖానాపూర్‌ 98 శాతంతో కొంతమేర ఫర్వాలేదు. కానీ.. నిర్మల్‌అర్బన్‌లో ఈనెల 27 ఉదయం వరకు 81.15 శాతం పూర్తయింది. ఇంకా 17,495 మంది డిజిటలైజేషన్‌ పెండింగ్‌ ఉంది. భైంసా అర్బన్‌లో 90.34 శాతం పూర్తయింది. ఇంకా 8,292 మంది డిజిటలైజేషన్‌ పూర్తి చేసుకోవడానికి ఫారాలు ఇవ్వలేదు.

పల్లెలు భేష్‌..

జిల్లా కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, ఉన్నతాధికారులు ముందునుంచీ చెబుతున్న విషయాలన్నింటినీ పల్లెప్రజలు తు.చా.తప్పకుండా పాటిస్తున్నారు. బీఎల్‌వోలు వచ్చిఇచ్చిన వెంటనే అవసరమైన పత్రాలతో ఎన్యూమరేషన్‌ ఫారాలు నింపి అప్పగించారు. గడువుకంటే పదిరోజుల ముందే జిల్లాలోని దస్తురాబాద్‌, కడెం, పెంబి, మామడ, దిలావర్‌పూర్‌, లక్ష్మణచాంద, నర్సాపూర్‌(జి), నిర్మల్‌రూరల్‌, సారంగపూర్‌, సోన్‌, బాసర, కుభీర్‌, కుంటాల, ముధోల్‌ మండలాల్లో వందశాతం సర్‌ ప్రక్రియను సిబ్బంది పూర్తి చేశారు. లోకేశ్వరం 99.90, తానూరు 99.98 శాతంతో మొత్తం ప్రక్రియ పూర్తికి అతిసమీపంలో ఉన్నాయి.

వారమే గడువు..

ఎస్‌ఐఆర్‌ ఆగస్టు 3తో ముగియనుంది. ఆలోపే తమ ఓటును కాపాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మున్ముందూ ఓటుహక్కు పొందడంలో ఇబ్బందులూ ఏర్పడవచ్చు. ఇప్పటికై నా పట్టణ ప్రాంత ఓటర్లు సోమరితనం, నిర్లక్ష్యం వీడి అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు.

అద్దె ‘ఓనర్ల’ గోస!

లక్షకు పైగా ఓట్లు పోయినట్లే..!

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పూర్తయిన తర్వాత దాదాపు లక్షకు పైగా ఓట్లు జాబి తాలో నుంచి పోనున్నాయి. ప్రస్తుత జాబి తా ప్రకారం జిల్లాలో 925 పోలింగ్‌ కేంద్రా ల పరిధిలో 7,55,344 మంది ఓటర్లు ఉ న్నారు. ఇందులో ఇప్పటి వరకు 7,27,503 మంది ఫారాలను డిజిటలైజేషన్‌ చేశారు. ఇక వందశాతం డిజిటలైజేషన్‌ పూర్తయిన పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఏఎస్‌డీ జాబితాలను కూడా పూర్తిచేశారు. ఏఎస్‌డీ అంటే.. అబ్‌సెంట్‌(ఫారాలు ఇవ్వనివారు), ఫిఫ్టెడ్‌(తరలివెళ్లినవారు), డెత్‌(చనిపోయినవారు) అలాగే డబుల్‌ఓట్‌ (రెండుచోట్ల ఓట్లు ఉన్నవారు) అని అర్థం. ఈ జాబితా ఈ కేటగిరీల వారికి సంబంధించిన వివరాలన్నీ నమోదు చేస్తారు. వీటితో పాటు ఆ ఓటు ఎందుకు తిరస్కరణకు గురైందనే కారణాన్నీ అందులో నోట్‌ చేస్తారు. సదరు జాబితాపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, చివరకు కలెక్టర్‌ సంతకాలు తీసుకుని ఫైనల్‌ చేస్తారు. ఈనెల 27 వరకు ఏఎస్‌డీ జాబితాల్లో మొత్తం 91,484 మంది ఓటర్ల పేర్లు నమోదయ్యాయి. అంటే వీరందరి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోనున్నాయి. వచ్చేనెల 3న గడువు ముగిసే వరకు జిల్లాలో లక్షకు పైగా ఓటర్ల పేర్లు పోనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఈనెల 27వరకు ఎస్‌ఐఆర్‌ వివరాలు..

మొత్తం పోలింగ్‌ స్టేషన్లు 925

మొత్తం ఓటర్లు 7,55,344

పంపిణీ చేసిన ఎన్యూరేషన్‌ ఫారాలు 7,55,344

ఆఫ్‌లైన్‌లో డిజిటలైజ్‌ చేసినవి 6,36,019

ఆన్‌లైన్‌లో డిజిటలైజ్‌ చేసినవి 91,484

మొత్తం డిజిటలైజ్‌ చేసినవి 7,27,503

డిజిటలైజేషన్‌ శాతం 96.31

డిజిటలైజేషన్‌ చేయాల్సిన ఫారాలు 27,841

డిజిటలైజేషన్‌ పూర్తయిన

పోలింగ్‌ స్టేషన్లు 742

సిద్ధం చేసిన ఏఎస్‌డీ జాబితాలు 925

ఏఎస్‌డీ జాబితాలో ఉన్న ఓటర్లు 91,484

పట్టణాల్లో స్పందనేదీ..!?

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లిన బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వోలు) ఎక్కువశాతం ఫారాలను సేకరించగా పట్టణాల్లో మాత్రం స్పందన ఆశించిన స్థాయిలో లేదు. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల కారణంగా కొంతమంది ఇవ్వడం లేదు. కొందరు రేపోమాపో ఇద్దామంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంట్లో ఫారాలను తిరిగి ఇచ్చేవారు లేకపోవడం, మరికొందరు చివరి రోజుల్లో ఇస్తామని వాయిదా వేయడం, తదితర కారణాలతో అర్బన్‌ ప్రాంతాల్లో సర్‌ నెమ్మదించింది. ఎన్నికల సమయాల్లోనూ అర్బన్‌ ఓటర్లు సోమరితనం ప్రదర్శిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్లు 88 శాతం పోలింగ్‌ నమోదు చేయగా, మున్సిపాలిటీ ఎన్నికల్లో నిర్మల్‌లో పట్టణ ఓటర్లు 65.60 శాతమే నమోదు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పట్టణ ప్రాంతాల్లో చాలామంది ఓటర్లు ఓటేసేందుకు ముందుకు రాలేదు.

ఏ ఒక్కరూ మిస్‌ కావొద్దు..

ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అనేది చాలా ప్రధానమైనది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఎన్యూమరేషన్‌ ఫారాలను తీసుకున్నవారు వెంటనే నింపి బీఎల్‌వోలకు తిరిగి ఇచ్చేయాలి. నిర్మల్‌, భైంసాలో కొంత వెనుకంజలో ఉన్నాం. మిగితా మండలాల్లో ప్రక్రియను వందశాతం పూర్తి చేశాం. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఏఎస్‌డీ జాబితాలనూ పూర్తి చేశాం. – భవేశ్‌మిశ్రా, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement