ఇళ్లలోకి పురుగులు వస్తున్నాయని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఇళ్లలోకి పురుగులు వస్తున్నాయని ఆందోళన

Jul 27 2026 11:49 PM | Updated on Jul 27 2026 11:49 PM

లక్ష్మణచాంద: గోదాంల నుంచి తమ ఇళ్లలోకివస్తున్న లక్కపురుగులతో ఇబ్బందిగా ఉందని సోమవారం బోరిగాం తండావాసులు గోదాంల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోరిగాంలో 20వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం కల్గి న గోదాములలో బియ్యం నిల్వ చేశారన్నా రు. ఇటీవల గోదాంల నుంచి పురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో ఇబ్బంది పడుతున్నా మన్నారు. ఎంపీడీవో నసీరుద్దీన్‌ సంఘటన స్థలానికి వెళ్లి వేర్‌హౌస్‌ గోదాం మేనేజర్‌ శివరామకృష్ణతో ఫోనన్‌లో మాట్లాడి.. గ్రామస్తులతోనూ మాట్లాడించారు. పురుగులు రాకుండా చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement