ఖానాపూర్: నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం సచివాలయంలో రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ సెక్రటరీ అహ్మద్ నదీమ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అటవీ శాఖ అధికారుల వేధింపులు, అనవసర ఆంక్షలను అరిక ట్టి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. టైగర్ రిజర్వ్ పరిధిలోని మండలాల్లో ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్జెడ్) అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేస్తూ విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల నిర్వహణకు అటవీ శాఖ నుంచి అనవసర అడ్డంకులు కల్పించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు.


