నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయవద్దని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి 96 దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, డీఆర్‌వో రాథోడ్ రమేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


