మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా వంశీ | - | Sakshi
Sakshi News home page

మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా వంశీ

Jul 27 2026 11:49 PM | Updated on Jul 27 2026 11:49 PM

నిర్మల్‌: మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన అప్పాల వంశీ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర కన్వీనర్‌ చింతపండు మహేందర్‌ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం బలోపేతం, మున్నూరుకాపు యువత సంక్షేమం, సామాజిక అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర నాయకత్వం సూచించింది. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని వంశీ తెలిపారు. కార్యక్రమంలో మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యాదా క్రాంతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి అనిల్‌ కుమార్‌, రాష్ట్ర సోషల్‌ మీడియా ఇన్‌చార్జి ఎర్రం సంజీవ్‌, సంఘ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement