ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. రుతుపవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. వాతావరణం చల్లగా ఉంటుంది.
ఎల్‌నినోను ఎదుర్కోవాలంటే పంటమార్పిడి తప్పనిసరి
నిర్మల్‌రూరల్: ఎల్‌నినోను ఎదుర్కోవాలంటే రైతులు పంటమార్పిడి విధానాలను అవలంబించి, తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు మళ్లాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. సోమవారం నిర్మల్ మండలం చిట్యాల రైతు వేదికలో జిల్లాస్థాయి విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పత్తి, కూరగాయలు, తదితర విత్తనాలను పంపిణీ చేశా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌ని నోను దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలను సంరక్షిస్తూ తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, ఉద్యానవన పంటలు, కూరగాయల సా గును ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు దీర్ఘకాలికంగా లాభదాయకమన్నారు. జిల్లాలో ప్రస్తుతం 8,751 ఎకరాల్లో సాగు చేస్తుండగా వచ్చే ఏడాది మరో 5 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్ర ణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు అవసరానికి మించి రసాయనిక ఎరువులు వినియోగించకుండా, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. భూసారాన్ని కాపాడేందుకు నానో యూరియా వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి రమణ, ఏవో వసంతరావు, సర్పంచ్ సుప్రియ, రైతులు పాల్గొన్నారు.
డిప్యూటీ ఈఈ
బాధ్యతల స్వీకరణ
బాసర: శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో నూతన డిప్యూటీ ఈఈగా నియమితులైన శేషగిరిరావు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈవో గంగ శ్రీనివాస్ వేదపండితుల సమక్షంలో శేషగిరిరావును శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు.


