నిర్మల్‌రూరల్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఉపాధ్యాయుల మౌఖిక డిప్యూటేషన్లు వెంటనే రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దస్తురాబాద్, ఖానా పూర్, కుంటాల, కుభీర్, ముధోల్, భైంసా మండలాల్లో జరుగుతున్న అక్రమ మౌఖిక డి ప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని కోరా రు. జీవో 25 ప్రకారం డిప్యూటేషన్లను కలెక్టర్ అనుమతితో ఇవ్వాల్సి ఉండగా ఇందుకు వి రుద్ధంగా నడుస్తున్నాయన్నారు. కలెక్టర్ జో క్యం చేసుకుని అవసరం ఉన్న మేరకే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని కోరారు. స మావేశంలో ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


