గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలి

Jun 16 2026 11:46 PM | Updated on Jun 16 2026 11:46 PM

● ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య ● కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా

నర్సాపూర్‌ (జి): గ్రామీణులందరికీ మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. నర్సాపూర్‌(జి) మండల కేంద్రంలోని 30 పడగల సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశారు. ఓపీ విభాగం, మందుల గది, ల్యాబ్‌, ఇన్‌, ఔట్‌ పేషెంట్‌ విభాగాలు, పలు వార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి సంబంధించిన మందులు, ఓపీ, తదితర రిజిస్టర్లు తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీరోజు సమయపాలన పాటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వైద్య సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కేజీబీవీ పాఠశాల, వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహంలో సౌకర్యాలు తెలుసుకున్నారు. ప్రతీరోజు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లను పంపిణీ చేశారు. తర్వాత చాక్‌పల్లి పరిధిలోని మోతక్‌పల్లి గ్రామం సుద్దవాగు ఇసుక రీచ్‌ను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణా జరగకూడదన్నారు. అక్రమ రవాణా చేసే వాహనాలు జప్తు చేయాలని ఆదేశించారు. కేవలం మన ఇసుక వాహనం యాప్‌ ద్వారానే ఇసుక అమ్మకాలు జరగాలని పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంట డీఈవో భోజన్న, డీసీహెచ్‌ఎస్‌ కాశీనాథ్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో పుష్పలత, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రమోద్‌చంద్రారెడ్డి, ఏపీవో తిరుపతిరెడ్డి, కేజీబీవీ ఎస్‌వో వీణ, సర్పంచ్‌ గడ్డం ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement