కవి వెంకట్‌కు సన్మానం | - | Sakshi
Sakshi News home page

కవి వెంకట్‌కు సన్మానం

Jun 3 2026 11:44 PM | Updated on Jun 3 2026 11:44 PM

నిర్మల్‌ఖిల్లా: జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు, సంస్కృత పద్యకవి బి.వెంకట్‌ రాష్ట్ర సాహితీ సన్మానాన్ని అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలోగల కళాలలిత కళావేదికలో శ్రీత్యాగరాయ గానసభ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ‘ప్రపంచ శాంతి’ పేరిట నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయనను సన్మానించారు. త్యాగరాయ గానసభ అధ్యక్షుడు శ్రీకళా వీఎస్‌ జనార్దన్‌ మూర్తి, ఆధ్యాత్మిక రచయిత పురాణపండ శ్రీనివాస్‌, సినీ గేయకవి మౌనశ్రీ మల్లిక్‌, పెద్దూరి వెంకటదాసు, కవయిత్రి శైలజామిత్ర వెంకట్‌ను ప్ర శంసాపత్రం, శాలువాతో సత్కరించారు. 51 మంది కవులు, కవయిత్రులు పాల్గొన్న సమ్మేళనంలో జిల్లా నుంచి ఏకై క ప్రతినిధిగా పాల్గొన్న వెంకట్‌ ప్రపంచ శాంతి, తెలంగాణ సంస్కృతి అంశాలపై కవితాగానం చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు కవులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement