నిర్మల్‌టౌన్: మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలని జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే సూచించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాల యం నుంచి ప్రారంభమైన ర్యాలీ మంచిర్యాల చౌరస్తా, శాంతినగర్ ఎక్స్ రోడ్, బస్టాండ్ మీదుగా చించోలి అర్బన్ పార్క్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. అటవీశాఖ అధికారులు నాగిని భాను, శివకుమార్, రామకృష్ణారావు, సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


