నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 3 2026 11:44 PM | Updated on Jun 3 2026 11:44 PM

గురువారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

ఉద్యమ జ్ఞాపకాలు

తెలంగాణ సాధనకు పదేళ్లపాటు జరిగిన మలి దశ ఉద్యమంలో సబ్బండ వర్గాలు భాగస్వాము లయ్యాయి. జిల్లాలో ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాల నేపథ్యంలో కథనం..

వరి కొయ్యలను కాల్చొద్దు

లక్ష్మణచాంద: వరి కొయ్యలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్‌ సూచించారు. బుధవారం సోన్‌ మండలంలోని న్యూవెల్మల్‌ గ్రామంలో వరి కొయ్యలు కాల్చితే కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి కొయ్యలు కాలిస్తే సూక్ష్మజీవులు నశించి నేలలో సారం తగ్గుతుందని, పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నారు. పంట అవశేషాలను నేలలోనే కలియ దున్నితే భూసారం పెరిగి రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుందని తెలిపారు. సోన్‌ ఏవో వినోద్‌కుమార్‌, ఏఈవో రాజ్‌కుమార్‌ తదితరులున్నారు.

నిర్మల్‌: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతంగా చేపట్టాల్సిన అవసరముంది. ధాన్యం సేకరణ లక్ష్యం లక్షా 89వేల మెట్రిక్‌టన్నులు కాగా, ఇప్పటివరకు దాదాపు లక్షా 8వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నా రు. కానీ, అనధికారికంగా ఇంకా లక్ష మెట్రిక్‌ టన్ను ల వరకు ధాన్యం కేంద్రాలు, రోడ్లపై కుప్పలుకుప్పలుగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మణచాంద మండలంలో కాస్త వేగంగా ధాన్యాన్ని తరలిస్తున్నా.. సారంగపూర్‌, దిలావర్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో ఇంకా పెద్దమొత్తంలో ధాన్యం అలాగే ఉంది. నిర్మల్‌తో పాటు ఈసారి భైంసా డివిజన్‌లోనూ ధాన్యం దిగుబడి పెరగడంతో రోడ్ల పొడవునా ఇప్పటికీ వడ్ల కుప్పలే కనిపిస్తున్న పరిస్థితి ఉంది.

కొరత.. రైతన్నకు వెత

వరి ధాన్యం రైతులకు సరిపడా గన్నీ సంచులు లేకపోవడం, హమాలీలు అందుబాటులో ఉండకపోవడం, సమయానికి సరిపోయే లారీలూ రాకపోవడం మరింత ఆలస్యానికి కారణాలవుతున్నాయి. మక్క రైతులు సంచికి అదనంగా డబ్బులు ఇస్తుండటంతో చాలావరకు హమాలీలు, లారీలు వాటిని ఎత్తడానికే మొగ్గుచూపుతున్నారు. అలా వెళ్లిన లారీల్లోని మక్కలను గోదాముల్లో అన్‌లోడింగ్‌ చేయడం ఆలస్యమవుతోంది. దాదాపు మక్కలను పూర్తిచేస్తే గాని వరి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో మక్కలు దాదాపు పెద్దసగం పూర్తికాగా, రెండువారాల్లో ధాన్యం పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు.

వానస్తే పరేషానే..

కేంద్రానికి వడ్లు తెచ్చి నైలెతంది. వెంటవెంట కొంటలేరు. 120బస్తాల వడ్లకు రోజూ కేంద్రంలనే కాపలా కాస్తున్న. వానస్తే వడ్లు తడుస్తయేమోనని భయపడుతున్న. సార్లు జెర వడ్లు కొని మా ఇబ్బందులు తీర్చాలె.

– లక్ష్మణ్‌, జామ్‌, సారంగపూర్‌ మండలం

‘పంట పండించుడు ఒకెత్తయితే, అమ్ముకునే దాకా కాపాడుకోవడం ఒకెత్తయితోంది. రోజూ ఆరబోసుడు, కుప్పలు చేసుడున్నది. ఎప్పుడు వానస్తదో.. ఎక్కడ పంట తడిసిపోతదో.. అని పరేషానవుడున్నది. ఎక్కడున్నా.. ఉరుక్కుంట పోయి టార్పాలిన్‌ కప్పి, పంట కాపాడుకోవాల్సి వస్తోంది. మాదగ్గర మక్కలయిపోయే దాకా వడ్లు కొనేటట్టులేరు. సార్లు.. ఎట్లన్న జేసి వానలు రాకముందే వడ్లెత్తాలె..’

అని సారంగపూర్‌ మండల రైతు భోజన్న వేడుకుంటున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి వేచిచూస్తున్న రైతులంతా ఇదేవిషయం చెబుతున్నారు. ఎప్పడొస్తుందో తెలియని అకాలవర్షంతో పాటు మరో వారం, పదిరోజుల్లో నైరుతి రుతుపవనాలూ రానుండటంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మక్కల కొనుగోలు వేగవంతం చేసినట్లే వడ్ల తరలింపునూ త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నారు.

వానలు రాకముందే..

‘ఇప్పటికే నెలరోజులకంటే ఎక్కువనే ఆగినం. ఇంకొన్నొద్దులు ఆగమా..! కానీ.. యాడ వర్షాలు వస్తాయోనని భయపడాల్సి వస్తోంది. అడపాదడప చెడగొట్టు గాలివానలు వస్తున్నయి. ఇంకో వారమైతే వానాకాలం చాలైతది. అందుకే అప్పటిలోపు వడ్లు ఎత్తాలని కోరుతున్నం..’ అని రైతులు అంటున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటివారంలో కేరళ తీరాన్ని దాటితే.. రెండుమూడు రోజుల్లో తెలంగాణకు చేరుకోవచ్చు. ఆలోపే ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియ పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ప్రకారం ధాన్యం తరలింపు జూన్‌ రెండోవారం దాటేలా కనిపిస్తోంది. మరోవైపు కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారులు నిత్యం కొనుగోళ్లపైనే దృష్టిపెట్టి వేగవంతం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement