విద్యార్థినులకు అభయహస్తం! | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినులకు అభయహస్తం!

Jun 3 2026 11:44 PM | Updated on Jun 3 2026 11:44 PM

● ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీపీవోలు ● నియామకానికి విద్యాశాఖ ఆదేశాలు ● వారానికో ప్రత్యేక తరగతి నిర్వహణ ● బాలికల రక్షణకు పకడ్బందీ చర్యలు

బాల్య వివాహాలను అరికట్టడం.

విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురికాకుండా చర్యలు చేపట్టడం.

బాల కార్మిక వ్యవస్థ నుంచి విద్యార్థినులను రక్షించడం.

వేధింపులకు గురయ్యే విద్యార్థినుల సమస్య నేరుగా తెలుసుకోవడం.

బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతూనే వారికి అవసరమైన న్యాయ సాయం అందించడం.

లక్ష్మణచాంద: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థినులు వేధింపులకు గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి భద్రతకు భరోసా కల్పిస్తూ అభయహస్తాన్ని అందించేందుకు నిర్ణయించింది. ప్రతీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక మహిళా ఉపాధ్యాయురాలిని (చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌) సీపీవోగా నియమించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర చట్టపరమైన సేవల అధికార సంస్థ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ)తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ సరికొత్త రక్షణ వ్యవస్థ అమల్లోకి రానుంది. వేధింపులకు గురై లోలోన కుమిలిపోయేవారు సీపీవోకు ఫిర్యాదు చేయవచ్చు. దీనితో ఇకపై పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా విద్యార్థినుల రక్షణ బాధ్యతలూ పర్యవేక్షించనున్నారు.

వారానికి ఒక క్లాస్‌ చొప్పున..

ప్రతీ పాఠశాలలో చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు వారానికి ఒక క్లాస్‌ తప్పనిసరిగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఇందులో రాజ్యాంగ విలువలు, పోక్సో యాక్ట్‌ తదితర కీలక చట్టాల గురించి విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో బోధించనున్నారు. ప్రతీ స్కూల్‌లో లీగల్‌ లిటరసీ క్లబ్‌ లేదా చైల్డ్‌ రైట్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేసి సెమినార్‌లు, పోటీల ద్వారా విద్యార్థినులను చైతన్య వంతులుగా తీర్చిదిద్దుతారు.

జిల్లా, మండల స్థాయిలో నోడల్‌ ఆఫీసర్లు

జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారి, మండల స్థాయిలో మండల విద్యాధికారిని నోడల్‌ ఆఫీసర్లుగా ని యమించనున్నారు. ప్రతీ మూడు నెలలకోసారి వా రు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో నమోదైన కేసులను పరిష్కరిస్తూ.. విద్యార్థినుల రక్షణ చ ర్యలు పర్యవేక్షిస్తారు. దీని అమలుకు అందుబాటులో ఉన్న వనరులతోపాటు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులను వినియోగించుకో వాలని డైరెక్టర్‌ తన ఉత్తర్వులో స్పష్టం చేశారు. పాఠశాలల్లో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్ల నియామకంతో వి ద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, డ్రాపౌట్ల సంఖ్య తగ్గుతుందని విద్యార్థినులు, పోషకులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు భావిస్తున్నారు.

ఇవీ.. సీపీవో విధులు

జిల్లాలోని పాఠశాలల వివరాలు

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 165

మొత్తం విద్యార్థులు 37,019

నియమించనున్న సీపీవోలు 165

Advertisement
 
Advertisement
Advertisement