‘వైద్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం’ | - | Sakshi
Sakshi News home page

‘వైద్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం’

Jun 3 2026 11:44 PM | Updated on Jun 3 2026 11:44 PM

దస్తురాబాద్‌: వైద్యానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రేవోజీపేటలో రూ.20లక్షలతో నిర్మించిన హెల్త్‌ సబ్‌ సెంటర్‌ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు నాణ్యమైన వైద్యం, విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పా రు. కార్యక్రజుమంలో సర్పంచ్‌ కోల మహేశ్‌, తహసీల్దార్‌ యాదవరావ్‌, ఎంపీడీవో రమేశ్‌రెడ్డి, పీహెచ్‌సీ వైద్యుడు నాగరాజు, కాంగ్రెస్‌ మండలాధ్యక్షడు రమేశ్‌రావ్‌, ఆయా గ్రామాల సర్పంచులు గోపాల్‌, నరేశ్‌రెడ్డి, గంగన్న, నరేశ్‌, సురేందర్‌, హెల్త్‌సూపర్‌వైజర్లు లలిత, పల్లవి, పంచాయతీ కార్యదర్శి కల్ప న తదితరులు పాల్గొన్నారు.

భూమిపూజ.. ప్రారంభోత్సవాలు

ఖానాపూర్‌: మండలంలోని పాత ఎల్లాపూర్‌లో పా ఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బొజ్జు భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని అధికారులు, స్థానికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం దిలావార్‌పూర్‌లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అనంతరం బాదన్‌కుర్తిలో నూతన పాఠశాల భవనం, కొత్తపేటలో నూతన పంచాయతీ భవనా న్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు శంకర్‌, ప్రశాంత్‌రెడ్డి, లోహిత, శ్రీనివాస్‌, మల్లేశ్‌, పల్లవి, నరేశ్‌, స త్యం, మాజిద్‌, పెద్దిరాజు, నవీన్‌, రాజేశ్వర్‌, రాజ న్న, పెద్దులు, రాజేందర్‌, రమేశ్‌, కుతుబొద్దీన్‌, సంతోష్‌గౌడ్‌, సచిన్‌, సాగర్‌, హరి, చరణ్‌, శోభన్‌, ధర్మరాజు, గంగన్న, శంకర్‌ తదితరులున్నారు.

పార్టీ కార్యాలయం ప్రారంభం

కడెం: మండల కేంద్రంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొజ్జు ప్రారంభించారు. ఇటీవల పలువురు మృతి చెందగా బాధి త కుటుంబాలను పరామర్శించారు. ఆయా కార్య క్రమాల్లో ఏఎంసీ చైర్మన్‌ భూషణ్‌, సర్పంచ్‌ విజ య్‌కుమార్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీశ్‌రెడ్డి, పా ర్టీ పట్టణాధ్యక్షుడు వాజీద్‌ఖాన్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు భవాని, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement