సనాతన ధర్మం గొప్పది | - | Sakshi
Sakshi News home page

సనాతన ధర్మం గొప్పది

Jun 3 2026 11:44 PM | Updated on Jun 3 2026 11:44 PM

లోకేశ్వరం: సనాతన ధర్మం గొప్పదని నందిపే ట్‌ పలుగుట్ట మహారాజ్‌ కేదార నంద స్వామీజీ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కిష్టాపూర్‌, మన్మద్‌ గ్రామాల్లో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలన్నింటికీ భారతదేశం ఆదర్శంగా నిలుస్తుందని చె ప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దోమల భోజ న్న హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, నాగేశ్‌, సుమన్‌కుమార్‌, శైలజ, భరత్‌గౌడ్‌, ప్రణీత, గంగాప్రసాద్‌ పాల్గొన్నారు.

‘కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి’

నిర్మల్‌టౌన్‌: రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలనే సంకల్పంతో కార్యకర్తలు కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అబ్జర్వర్‌ సమతా సుదర్శన్‌ సూచించారు. పార్టీ ఎస్సీ సెల్‌ నియామకాల కోసం బుధవారం జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్‌ ఫంక్షన్‌హాల్‌లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దళిత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కట్ట శ్యామ్‌, ప్రధాన కార్యదర్శి కొంతం గణేశ్‌, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement