నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 2 2026 12:44 AM | Updated on Jun 2 2026 12:44 AM

మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్‌ శ్రీ 2026

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కట్టి.. 2.5లక్షల ఎకరాలకు నీరందిస్తాం బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల మంజూరుకు శ్రీకారం సీఎం పర్యటనతో శ్రేణుల్లో జోష్‌

న్యూస్‌రీల్‌

7

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి

నిర్మల్‌టౌన్‌: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యను పోలీస్‌ అధికారులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా పోలీసులు ఉండాలని ఎస్పీ డాక్టర్‌ జానకీషర్మిల జిల్లా పో లీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పో లీస్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెనన్స్‌ ని ర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. స మస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించా రు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రెబ్బెన/ఆసిఫాబాద్‌: పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీగూడెం, తండాలో గిరిజనులందరికీ నూరుశాతం ఇళ్లు మంజూరు చేసి, అడవి బిడ్డలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయాలనేదే మా ఆలోచన అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏ అభివృద్ధి, సంక్షే మ పథకమైనా ఈ గడ్డనుంచే ప్రారంభిస్తున్నామని, ఏడాదిలోగా గుడిసెలు లేని జిల్లాగా ఉమ్మడి ఆది లాబాద్‌ను మారుస్తామని అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలంలోని కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి బాట బహిరంగ సభకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారా వు, సీతక్క, వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు వంశీకృష్ణ, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ విఠల్‌, ఎమ్మెల్యేలు ప్రేంసాగర్‌ రావు, కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బా బు, వెడ్మ బొజ్జు, గడ్డం వినోద్‌తో కలిసి హాజరయ్యా రు. జిల్లాలో రూ. 112 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మాజీ మావో యిస్టు నగేశ్‌ దంపతులతోపాటు పలువురు లబ్ధిదా రులకు రెండో విడత ఇందిరమ్మ మంజూరు పత్రాలు అందించారు. రెండోవిడత కార్యక్రమాన్ని ఈ వేదిక నుంచే ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.

తుమ్మిడిహెట్టితో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ చేపట్టిన ప్రాణ హిత– చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లోకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ఎలాంటి ఎత్తిపోతలు, విద్యు త్‌ ఖర్చు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే సాగునీరందిస్తామని అన్నారు. ఈ విషయంలో రైతులకు అన్యాయం చేయాలని చూస్తే రైతాంగం ఉప్పైనె కదులుతుందని హెచ్చరించారు.

ఆద్యంతం.. ఉత్సాహభరితం

ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. హైదరాబాద్‌ నుంచి నేరుగా కెరమెరి మండలం కొత్తగూడకు చేరుకుని ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద కు చేరుకున్నారు. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సభాస్థలి జనసంద్రంగా మారింది. రాత్రి 7.45 గంటల నుంచి గంటన్నరకు పైగా కొనసాగింది. మంత్రులు మా ట్లాడిన అనంతరం సీఎం ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు వరిధాన్యం, మొక్కజొన్న, సోయాబీన్‌ కొనుగోళ్లు విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అనంతరం రోడ్డు మార్గంలో మంచిర్యాలకు వెళ్లారు. అయితే కుమురంభీం ఆసిఫా బాద్‌ జిల్లాకు ప్రత్యేక వరాలేవీ ప్రకటించకపోవడం నిరాశకు గురిచేసింది. ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో ఎస్పీలు నితిక పంత్‌, అఖిల్‌ మహాజన్‌, పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ప్రేంసాగర్‌రావుకు పెద్దపీట

సభలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావుకు ప్రత్యేక స్థానం దక్కింది. సభాస్థలికి చేరుకోగానే ప్రేంసాగర్‌రావును వెంట బెట్టుకుని సీఎం సభావేదికపైకి వచ్చారు. స్టేజీపై పక్కనే కూర్చొబెట్టుకున్నారు. ప్రేంసాగర్‌రావు జిల్లాలోని సమస్యలతోపాటు పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాలకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టాలని, మంచిర్యాలలో ప్రభుత్వ యూనివర్సిటీ మంజూరు చేయాలని విన్నవించారు.

Advertisement
 
Advertisement
Advertisement