జై తెలంగాణ.. 12 ఏండ్ల పాలన | - | Sakshi
Sakshi News home page

జై తెలంగాణ.. 12 ఏండ్ల పాలన

Jun 2 2026 12:44 AM | Updated on Jun 2 2026 12:44 AM

● ఊరూవాడ ఏకమై.. అడుగులన్నీ ఒక్కటై.. ● తెలంగాణ నినాదమే ప్రతిఒక్కరి ఊపిరై.. ● ఉద్యమించిన నిర్మల్‌ బిడ్డలు.. ● ప్రాణాలనూ అర్పించిన అమరవీరులు ● పుష్కరకాలంలో గణనీయంగా మార్పులు ● కడెం మండలంలో జేఏసీ నాయకులు కడెం నుంచి కొండగట్టు హనుమాన్‌ ఆలయం వరకు పాదయాత్ర చేశారు. ● ఖానాపూర్‌ మండలంలో ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. అప్పటి ఎంపీ రాథోడ్‌రమేశ్‌కు వ్యతిరేకంగా నినదించింది. ఉద్యమకారులు అమంద శంకర్‌ పొర్లుదండాలు పెడితే.. విజయలక్ష్మి ఖానాపూర్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు పాదయాత్ర చేశారు. ● మామడ మండలం పొన్కల్‌లో ఏకంగా అప్పటి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డినే అడ్డుకున్నారు. తెలంగాణ ఇచ్చేదాకా ఇటువైపు రావొద్దని నినదించారు. ● దిలావర్‌పూర్‌(ప్రస్తుత నర్సాపూర్‌తోపాటు) మండలం రాంపూర్‌లో యువకులు బస్సు అద్దాలను పగలగొట్టి ఆవేశాన్ని చాటారు. అప్పటి జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ దిలావర్‌పూర్‌ మండలం కదిలె ఆలయానికి వచ్చి మొక్కుకున్నారు. ● కుంటాల మండలం ఓలకు చెందిన పోరుబిడ్డ కూస వనిత ముధోల్‌మండలం కిర్గుల్‌(బి)లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సభలో తెలంగాణ పొలికేక పెట్టింది. ● కుభీర్‌ మండలంలో వికలాంగుడైన పుప్పాల పీరాజీ చెప్పులు లేకుండానే తిరిగారు. ● తానూర్‌ మండలంలోని భోసిలో సాధారణ హోటల్‌ నడుపుకునే బామన రాఘవులు తొలిసారిగా జిల్లాలో మూడురోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ● చదువుల తల్లి కొలువైన బాసర ట్రిపుల్‌ఐటీలో తెలంగానం హోరెత్తింది. ● నిర్మల్‌లో ఆర్డీవో కార్యాలయం వద్ద ప్రతిరోజూ నిరసనలు, నిరాహార దీక్షలను చేపట్టారు. ● ఉద్యమం జరుగుతున్న తీరుపై రీసెర్చ్‌ కోసం అప్పట్లో ఓ జర్మన్‌ యువతి రావడం విశేషం.

2016 అక్టోబర్‌ 12 విజయదశమి రోజున నిర్మల్‌ ప్రాంతం 19మండలాలతో కొత్త జిల్లాగా ఏర్పడింది.

స్వరాష్ట్రంలో నిర్మల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పదేళ్లపాటు రాష్ట్ర మంత్రిగా కొనసాగారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాకు దక్కిన అతిపెద్ద బహుమతి నిర్మల్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు. 2022 ఆగస్టు 9న వైద్య కళాశాలను మంజూరు చేశారు.

వైద్యరంగంలో గతంలో ఊహించని విధంగా ఐసీయూ, డయాలసిస్‌, డయాగ్నోస్టిక్‌సెంటర్‌లు వచ్చాయి.

ౖఇప్పటికీ జిల్లా పారిశ్రామికంగా, విద్యపరంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. రైల్వేలైన్‌, ఇంజినీరింగ్‌ కాలేజీ, నవోదయ విద్యాలయం, పర్యాటకాభివృద్ధి ఇవన్నీ అందని ద్రాక్షలుగానే ఉన్నాయి.

నిర్మల్‌: ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ...’ పన్నేండేళ్ల క్రితం మార్మోగిన జననినాదం. ఎటు చూసినా.. ఎక్కడ విన్నా.. ఇదే మంత్రం. ఉవ్వెత్తున సాగి న స్వరాష్ట్ర సాధనోద్యమంలో నిర్మల్‌గడ్డ సైతం భా గమైంది. చిన్న నుంచి పెద్దదాకా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. సబ్బండ వర్గాలు, సమస్త ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలన్నీ ముందుకు వచ్చాయి. పార్టీలకతీతంగా జెండాలు, అజెండాలు పక్కన పెట్టి నా యకులంతా పోరుబాటలో నడిచారు. చారిత్రక నేపథ్యం ఉన్న పోరుగడ్డ నిర్మల్‌ ప్రాంతం సైతం స్వరాష్ట్ర ఉద్యమంలో కీలకంగా నిలిచింది. ఉద్యమంలో జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక భైంసా నుంచే ముగ్గురు యువకులు తమ ప్రాణాలను అర్పించడం మర్చిపోలేం. ప్రాణత్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణకు నేటితో 12 ఏండ్లు నిండాయి. ఈ పుష్కరకాలంలో జిల్లాగా మారిన నిర్మల్‌ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి.

‘పోరు’లో ప్రతీ ఊరు..

● అప్పటి లక్ష్మణచాంద(ప్రస్తుత సోన్‌) మండలంలోని బొప్పారం గ్రామస్తులు అఖండ తెలంగాణ జ్యోతిని వెలిగించారు. స్వరాష్ట్రం సాధించే వరకూ ఆ జ్యోతి ఆరకుండా ఉద్యమస్ఫూర్తిని రగిలించారు.

పుష్కరంలో మార్పులెన్నో..

స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత.. నిర్మల్‌ ప్రాంత పరిస్థితులూ మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement