ఆవిర్భావ వేడుకలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

ఆవిర్భావ వేడుకలకు వేళాయె

Jun 2 2026 12:44 AM | Updated on Jun 2 2026 12:44 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గౌరవ అతిథులు, ప్రజాపతినిధులు, అధికారులు ఉదయం 7.55 గంటలకు నిర్మల్‌ సమీకృత జిల్లా కార్యాలయంలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. 8 గంటలకు ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం పతాకావిష్కరణ చేస్తారు. 8:05 కు గౌరవ వందనం, 8:07 నుంచి 8:20 వరకు ముఖ్య అతిథుల ప్రసంగం, 8:20 నుండి 9 గంటల వరకు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల సాస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 9:15 గంటలకు తేనేటి విందు ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement