మొక్కజొన్నపంట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్నపంట దగ్ధం

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

బాసర: మండలంలోని సురెల్లి శివారులో రైతు పట్టేవార్‌ ఆనంద్‌కు చెందిన మొక్కజొన్న ప్రమాదవశాత్తు దగ్ధమైంది. సదరు రైతు అరెకరంలో సాగు చేసిన మొక్కజొన్న పంటను ఇటీవలే కోసి కుప్పగా వేశాడు. మంగళవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో పంట దగ్ధమైంది. ఘటనపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

108 సిబ్బందికి ఉత్తమ పురస్కారం

జన్నారం: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జన్నారం 108 అంబులెన్స్‌ ఈఎంటీ, పైలట్‌లు ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతీలో ఈఎంటీ కిషన్‌, పైలట్‌ రఫీక్‌ మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఫ్యామిలి వెల్ఫేర్‌ కమిషనర్‌ క్రిస్టియానో, హెల్త్‌ కమిషనర్‌ సంగీత చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని జిల్లా ప్రోగ్రాం అధికారి సమ్రాట్‌, జిల్లా ఈఎంఈ కొండల్‌రావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement