రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

● ఘటనకు కారకులను శిక్షించాలని గ్రామస్తుల ఆందోళన

మామడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చే సుకుంది. మండలంలోని దిమ్మదుర్తికి చెందిన దండుగుల సా యిరాం(26) సోమవారం రాత్రి మామడ నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొ ట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలంను పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామస్తుల ఆందోళన

యువకుడి మృతికి కారకులను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం గ్రామస్తులు నిర్మల్‌–ఖానాపూర్‌ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సీఐ గోవర్ధన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కారకులను శిక్షిస్తామని చెప్పడంతో ఆందోళన

విరమించారు.

మృతికి కారకులపై కేసు

యువకుడి మృతికి కారకులను మంగళవారం అరెస్ట్‌ చేసినట్లు ఏఎస్పీ సాయికిరణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అజాగ్రత్తగా ట్రాక్టర్‌ నడిపి ప్రమాదానికి కారకులైన మైనర్‌ బాలుడు, వాహన యాజమాని అలకుంట రాములుపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement