నిర్మల్‌టౌన్: నిర్మల్‌లో తీవ్ర వి షాదం చోటుచేసుకుంది. స్థాని క బంగల్‌పేట్ మహాలక్ష్మీ వాడ సీబ్లాక్ డబుల్ బెడ్‌రూం కాలనీలోని ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలడంతో ఇద్దరు మృతి చెందారు. సీ ఐ సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వ గడ్డ కాలనీలో నివాసం ఉంటున్న ఒడిసెల విజయ్(50) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అక్కడి నుంచి డబుల్ బెడ్‌రూం కాలనీలోకి ఇల్లు మారేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో సామాన్లు సర్దేందుకు మహిళా కూలీని తీసుకెళ్లాడు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఫ్రిడ్జ్ పేలడంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటల్లో తీవ్రంగా కాలిపోయిన ఇద్దరిని స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. విజయ్‌కు భార్య, ఇద్ద రు కూతుళ్లు ఉన్నారు. మహిళా కూలీ ఎడమ చేతిపై సాయిలు, లలిత, బాలాజీ అని తెలుగులో పచ్చబొట్టుతో రాసి ఉందని సీఐ పేర్కొన్నారు. చామన ఛాయా రంగుతో ఉండి ఎత్తు 5.1 అడుగుల ఎత్తు ఉంటుందన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో ఉంచినట్లు వెల్లడించారు. మహిళ వివరాలు తెలిసిన వారు 8712659511, 8712659512 నంబర్‌లలో సంప్రదించాలని కోరారు.
కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రాణహితకాలనీకి చెందిన కానిస్టేబు ల్ కుమార్ ఇంట్లో చోరీ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ విధి నిర్వహణలో భా గంగా ఇ టీవల బందోబస్తుపై కొండగట్టుకు వె ళ్లాడు. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు సైతం జాతర కోసం సొంతూరు వెళ్లారు. జాతరకు వెళ్లిన వారు శనివారం తిరిగి వచ్చా రు. వారు వచ్చిన సమయంలో వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం ఉతికిన బట్ట లు బీరువాలో పెట్టడానికి బీరువా తలుపు తెరిచి చూడగా లాకర్ ఓపెన్ చేసి ఉంది. అందులో దాచి ఉంచిన 15 తులాల బంగారు ఆభరణాల్లో 10 తులాల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


