బాసర: ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి, రెండో సంవత్సరాల విద్యార్థుల అకాడమిక్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రారంభించిన ‘స్టడీ అ వర్స్’ కార్యక్రమానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు, అవార్డులను సొంతం చేసుకుంది. నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ బుక్ ఆఫ్ వర ల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ ఎక్సలెన్స్, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ ఎడ్యుకేషని స్ట్ అవార్డులు వరించాయి. అంతర్జాతీయ పత్రిక ‘యూకే మిర్రర్’ మొదటి పేజీలో ఆర్జీయూకేటీ ముఖచిత్రం ప్రచురించడంతో పాటు స్టడీ అవర్స్‌పై ప్రత్యేక కథనం ఇచ్చింది. వైస్ చాన్స్‌లర్ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, క్రమశిక్షణతో పాటు ఉద్యోగుల పర్యవేక్షణ, శ్రమ కారణమన్నారు.


