అంతర్జాతీయ యోగాడే కోసం యువత భాగస్వామ్యం కావాలంటున్న ఆయుష్ శాఖ రీల్స్, ఫొటోగ్రఫీలకు ఆహ్వానం ఎంపికై న వాటికి నగదు బహుమతులు ఎంట్రీలను పంపేందుకు ఏప్రిల్ 20 తుదిగడువు
బహుమతి యోగం
నిర్మల్‌ఖిల్లా: యువతకు రీల్స్, ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ శాఖ జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రీల్స్, ఫొటోగ్రఫీలో తమ సృజనాత్మకతకు పదును పెట్టాలంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యోగా ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొంటున్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి నగదు పురస్కారాలతో పాటు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. యోగా ప్రాధాన్యతను తెలిపేలా ఫొటోగ్రఫీ, రీల్స్ రూపొందించే చక్కని అవకాశం కల్పించింది. ఇందులో యువత, సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్లు పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ శాఖ అవకాశం కల్పిస్తున్నాయి.
యోగా ప్రాధాన్యతపై రీల్స్...
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ శాఖ సంయుక్తంగా దేశవ్యాప్తంగా యోగా ప్రేమికులకు ప్రత్యేక అవకా శం కల్పిస్తున్నాయి. ‘యోగా మై ప్రైడ్’ కార్యక్రమంలో భాగంగా క్రియేటివ్ యోగా రీల్స్ రూపొందించాలని సూచిస్తున్నాయి. ఈ పోటీ ద్వారా యోగా సాధన, ఆసనాలు, ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక ప్రశాంతత వంటి అంశాలను సృజనాత్మకంగా ప్ర జలకు చేరవేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. యువతతో పాటు అన్ని వయస్సుల వారు తమ ప్ర తిభను ప్రదర్శించి ఆరోగ్యకర జీవనశైలిపై అవగా హన పెంచేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది.
ఫొటోగ్రఫీలోనూ...
కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ‘యోగా మై ప్రైడ్–2026’ ఫొటోగ్రఫీ పోటీలకు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. యోగా ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించేందుకు ఈ పోటీ నిర్వహించబడుతోంది. ఏప్రిల్ 20 వరకు ఎంట్రీలు స్వీకరించనున్నారు. అన్ని వయస్సుల వారు పాల్గొనవచ్చు. మహిళలు, పురుషులు వేర్వేరు విభాగాల్లో యువత (18 సంవత్సరాల లోపు), పెద్దలు (18 పైబడిన వారు), యోగా ప్రొఫెషనల్స్‌గా మూడు కేటగిరీలుగా పాల్గొనే అవకాశం ఉంది. ప్రతీ కేటగిరీలో ప్రథమ బహుమతి రూ.75 వేలు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25వేల నగదు బహుమతులు అందజేయనున్నారు. పాల్గొనదలచిన వారు తమ యోగాసనంతో కూడిన ఫొటోను, 15 పదాలకు మించని స్లోగన్‌తో అప్లోడ్ చేయాలి. ఫొటోలు జేపీజీ ఫార్మాట్‌లో 2ఎంబీ లోపే ఉండాలి. ఒక వ్యక్తి ఒకే కేటగిరీలో ఒకఫొటో మాత్రమే పంపించాలి. మరిన్ని వివరాలకు వెబ్‌పోర్టల్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
పాల్గొనేవారికి మార్గదర్శకాలు
పోటీలో పాల్గొనేవారు కనిష్టంగా 60 సెకన్ల నుంచి గరిష్టంగా 90 సెకన్ల వ్యవధిలో యోగా రీల్స్ రూపొందించాలి. వీడియోలు ఎంపీ4 ఫార్మాట్‌లో, పోర్టైడ్ మోడ్ (9:16)లో, ఉన్నత నాణ్యతతో ఉండాలి. పంపే కంటెంట్ పూర్తిగా స్వయం సృష్టిగా ఉండాలి. తమ వీడియో లింకును www.m ygov.i n పోర్టల్‌లో సమర్పించాలి. వీడియోలు గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్ట్రాగామ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో పబ్లిక్‌గా అందుబాటులో ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ లేదా ఏదైనా ప్రాంతీయ భాషలో వీడియోలు రూపొందించవచ్చు. ఉత్తమంగా ఎంపికై న 10 మంది విజేతలకు ఒక్కొక్కరికి రూ.10వేల నగదు బహుమతిని అందిస్తారు. ఉమ్మడి జిల్లాలోని యువత, యోగా అభ్యాసకులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను జాతీయ స్థాయిలో చాటాలని అధికారులు సూచిస్తున్నారు. యోగా ద్వారా ఆరోగ్యం, ఆనందం, సమతుల్యతను ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని కోరుతున్నారు.


