దేవుడి పేరిట ఓట్లు అడగం | - | Sakshi
Sakshi News home page

దేవుడి పేరిట ఓట్లు అడగం

Apr 5 2026 9:30 AM | Updated on Apr 5 2026 9:30 AM

● రాముడి పేరుతో బీజేపీ రాజకీయం ● పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ● నిర్మల్‌ డీసీసీ కమిటీ ప్రమాణస్వీకారం

నిర్మల్‌: తామూ శ్రీరాముడిని, శివుడిని పూజిస్తామ ని, కానీ బీజేపీ లాగా దేవుడి పేరిట తాము ఓట్లు అడగమని, విభజన రాజకీయాలు చేయమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. బీజేపీ కేవలం దేవుడు, మతం ఆధారంగానే రాజ కీయం చేస్తోందని ఆరోపించారు. నిర్మల్‌లో ఈసా రి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలకు ఇదే ఆఖరిసారి అవుతుందన్నారు. జిల్లాకేంద్రంలో శనివారం నిర్వహించిన డీసీసీ పాలకవర్గ ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ సర్కార్‌ ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఎన్ని సంస్థలు పెట్టిందనే లెక్కలు చెప్పాలన్నారు. ఉన్న ప్రభుత్వ సంస్థలను అంబానీ, ఆదానీలకు అప్పగించారని ఆరో పించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఏర్పా టు చేసిన సంస్థల ముందు మోదీ ఫొటోలకు ఫోజు లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీ ఆర్‌ పదేళ్ల పాలనకాలంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబి లోకి నెట్టారని ఆరోపించారు. వాళ్ల కుటుంబంలోనే చెరోదిక్కు ఉన్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ప్రజలు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ఖానా పూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌సావంత్‌, మాజీమంత్రులు వేణుగోపాలచారి, ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌, నారాయణ్‌పటేల్‌ పాల్గొన్నారు.

పనిచేసేవారికి గుర్తింపు..

ఖానాపూర్‌ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నూ తన కార్యవర్గంలో పీసీసీ చీఫ్‌ ప్రమాణం చేయించారు. అనంతరం బొజ్జు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడి సూచన మేరకు పూర్తిస్థాయిలో జిల్లా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అన్ని వర్గాలను, సీనియర్‌ నాయకుల సమన్వయంతో కమిటీ సభ్యులుగా నియమించడం జరిగిందని తెలిపారు. పార్టీలో చురుగ్గా పనిచేసే ప్రతీ కార్యకర్తను అధిష్టానం గుర్తించి తగిన బాధ్యతలు ఇస్తుందన్నారు. నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ అనైతిక దోస్తీ

ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ అనైతిక దోస్తీ బయటపడిందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌ పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన చైర్మన్‌ ఎన్నికలో తమ చైర్మన్‌ అభ్యర్థికి మద్దతుగా మెజార్టీ సభ్యులు చెయ్యెత్తారని, ఇందుకు వీడియో సాక్ష్యం కూడా ఉందని స్పష్టంచేశారు. దమ్ముంటే.. జాన్సన్‌ నాయక్‌, రితీష్‌రాథోడ్‌ తమ కౌన్సిలర్లను పట్టుకుని రావాలని, తాను కాంగ్రెస్‌ కౌన్సిలర్లను తీసుకొస్తానన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహిద్దామని సవాల్‌ విసిరారు. ఆదివాసీ ఎమ్మెల్యేనైన తనను, తమ కౌన్సిలర్లను భయపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు సచిన్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు శ్రీహరిరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, రేఖాశ్యామ్‌నాయక్‌, నూతన కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లు

నిర్మల్‌ఖిల్లా: జిల్లాకేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా కీలక కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమ నైపుణ్యాలు, శిక్షణ కార్యక్రమాలు, ఫెలోషిప్‌లు, అప్రెంటిషిప్‌లకు సంబంధించిన గోడపత్రికలను శనివారం ఆవిష్కరించారు. విద్యార్థులకు వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలపై సమగ్ర సమాచారం అందించనున్నారు. ప్రధానంగా టీసీఎస్‌ అయాన్‌ జాబ్‌ అచీవర్‌ బిజినెస్‌ ఆపరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రాం, విద్యార్థినులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే వీ– హబ్‌ కార్యక్రమం, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, రిటైలర్స్‌ అసోసియేషన్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అందిస్తున్న స్టైఫండ్‌తో కూడిన అప్రెంటిస్‌షిప్‌ పథకాలు విద్యార్థులకు ఉపయోగపడనున్నాయి. నిపుణ ఫెలోషిప్‌ పథకం ద్వారా ఉద్యోగ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశాలు, సమతా ఫ్రీషిప్‌ల ద్వారా ఆదివాసీ యువత, తతీయ లింగీయులు, దివ్యాంగులకు ఉన్నత విద్యలో సమాన అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్‌ ఎం. సుధాకర్‌, అధ్యయన కేంద్రం సమన్వయకర్త యు.గంగాధర్‌ మాట్లాడుతూ, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును బలోపేతం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పీజీ.రెడ్డి, జి.సుభాష్‌, టి.శ్రీనివాస్‌, కట్ట రమేశ్‌, రజిత, సాదియా తహనీయాత్‌, ఆఫ్రిన్‌, మేహరాజ్‌ ఖానం, సనా గజాల, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సిబ్బంది ఎస్‌.స్రవంతి, గంగాధర్‌ పాల్గొన్నారు.

ఖానాపూర్‌: ఖానాపూర్‌ మున్సిపాలిటీలో నిర్వహించాల్సిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలను ఎమ్మెల్యే అధికార దుర్వినియోగంతో ఫలితాలను ప్రకటించకుండా వాయిదా వేయించారని బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు కౌన్సిలర్లతో కలిసి కలెక్టర్‌ అభిలాష అభినవ్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నిక ప్రక్రియను వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. దీనికి కారణమైన ఎమ్మెల్యేతోపాటు సహకరించిన అధికారులపై చర్య తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఆదివారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు లేకుండా అధికార దుర్వినియోగం జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని విన్నవించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్‌రాథోడ్‌, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్‌ నాయక్‌, కౌన్సిలర్లు రాజగంగన్న, గుమ్ముల ఆనంద్‌, షోయబ్‌, బొప్పారపు సత్యవతి, అంకం మౌనిక, బండిపల్లి సింధూజ, తొడసం ఇందిర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement