● డ్రైవర్‌కు తీవ్రగాయాలు
ముధోల్: మండల కేంద్రంలోని స్థానిక బాలుర గురుకుల పాఠశాల వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. భైంసా వైపు నుంచి సిమెంట్‌లోడ్‌తో వస్తున్న లారీ మొరంలోడ్‌తో ముందు నుంచి వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్టిన అనంతరం గురుకుల పాఠశాల ప్రహరీని ఢీ కొట్టింది. దీంతో లారీ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ షంషొద్దీన్ అందులోనే ఇరుక్కున్నాడు. విషయం తెలుసుకున్న సీఐ రవీందర్‌నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో డ్రైవర్‌ను బయటకు తీయించారు. డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలించారు.


