భైంసారూరల్: సమాజంలో సేవా గుణం కలి గి ఉండాలని భైంసా జూనియర్ సివిల్ జడ్జి దేవంద్రబాబు అన్నారు. మండలంలోని చు చుంద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్, ప్రింటర్‌ను శనివారం ప్రారంభించారు. దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీసాయి శ్రద్ద ఫార్మసీ ముంబై వారు రూ.40 వేల విలువ చేసే కంప్యూటర్, ప్రింటర్‌ను విరాళంగా అందించడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించేలా మార్గని ర్దేశం చేయాలని సూచించారు. సర్పంచ్ గణేశ్, ఎంఈవో సుభాష్, హెచ్‌ఎం మంతెన వెంకటేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


