న్యూస్‌రీల్
మళ్లీ వాయిదా పడిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
సాయంత్రం వరకూ కొనసాగిన గందరగోళం
ఆగ్రహంతో వెళ్లిపోయిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
స్పృహ తప్పి పడిపోయిన బీజేపీ కౌన్సిలర్
నేటికి వాయిదా వేసిన అధికారులు
నిర్మల్
బాసర పీహెచ్‌సీలో మందుల్లేవ్!
బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో మందులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఫార్మసిస్టు శ్రీనివాస్ బదిలీతో ఆర్డర్ పెట్టలేదు.
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. ఒకటిరెండు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి చలి ప్రభావం పూర్తిగా తగ్గుతుంది.
రీల్స్.. ఫొటోలకు బహుమతి ‘యోగ’ం
కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ శాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రీల్స్, ఫొటోగ్రఫీలో సృజనాత్మకతకు పదును పెట్టాలని దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
9లోu
8లోu
50 రోజులుగా పాలకవర్గం లేక..
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగి 50 రోజులు అవుతున్నా ఖానాపూర్‌లో ము న్సిపల్ పాలకవర్గం ఏర్పడలేదు. ఫిబ్రవరి 16న పూర్తి కావాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 4న ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది. శనివారం కూడా గందరగోళంతో ఆదివారానికి అధికారులు వాయిదా వేశారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్ టౌన్: క్రీడా పాఠశాలలో ప్రవేశం కో సం నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా కు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికై న ట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. బాలికల విభాగంలో హిషిక, మధు ప్రియ, స్నేహశ్రీ, రాథోడ్ అనికా, గుర్రం ధనశ్రీ, సోలంకి ఓవిశ్రీ, తన్విశ్రీ, లోహిత, సీహెచ్ స్నేహిత జిల్లాస్థాయిలో పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. బాలుర విభాగంలో... హన్షిత్, అ యాన్ , రాథోడ్ సచిన్, పవర్ ఆనంద్ నాయ క్, ముల్లెవార్ ప్రణయ్, నివేదన్ ఎంపికయ్యా రు. వీరు ఈనెల 25న ఉదయం 11 గంటల కు కలెక్టరేట్‌లోని జిల్లా క్రీడల శాఖ కార్యాలయనికి మూడో తరగతి ప్రోగ్రెస్ కార్డ్ , ఆధార్ కార్డ్ జిరాక్స్, జనన ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్, నాలుగు పాస్‌ఫొటోలతో రావాలని సూచించారు. వెరిఫై చేసిన అనంతరం ఈనెల 26న సంబంధిత పత్రాలను హకీంపేట్ స్కూల్లో సమర్పించాలని తెలిపారు.
ఖానాపూర్: ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మూడోసారి వాయిదా పడింది. గతంలో రెండుసార్లు బీఆర్‌ఎస్, బీజేపీ కౌ న్సిలర్లు గైర్హాజరు కావడంతో కోరం లేక అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. శనివారం జరిగిన మూడో విడత ఎన్నిక ప్రక్రియలో చేతులెత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సాయంత్రం వరకూ గందరగోళం నెలకొంది. చివరకు అధికారులు ప్రక్రియను ఆదివారా నికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఏం జరిగిందంటే..
మున్సిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్ శనివారం సమావేశానికి వచ్చారు. చైర్‌పర్సన్ ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యే అభ్యంతరం తెలిపారు. సంతకాల సేకరణ సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థి చిన్నం సత్యంకు మెజారిటీకి సరిపడా ఓట్లు వేశారని, దీనిపై వీడియోలను స్పష్టంగా పరిశీలించి తదుపరి ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వీడియోలు పరిశీలించకుండా బీజేపీ అభ్యర్థి పేరును ఎందుకు ప్రతిపాదిస్తారని అధికారులను నిలదీశారు. కౌన్సిలర్లతో కలిసి ఆందోళన చేశారు. చైర్మన్‌గా చిన్నం సత్యంను ప్రకటించాలని డి మాండ్ చేశారు.
బయట ఉద్రిక్తతలు..
కాంగ్రెస్ అభ్యర్థి చిన్నం సత్యం చైర్మన్‌గా ఎన్నికై న ట్లు అధికారులు ప్రకటించలేదు. దీంతో ఎమ్మెల్యే, కాంగ్రెస్ కౌన్సిలర్లు అక్కడి నుంచి వెళ్లిపోయా రు. అనంతరం బీఆర్‌ఎ స్, బీజేపీ నాయకులు బారికేడ్లను తోసుకుంటూ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేయలేక ఇబ్బంది పడ్డారు. పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏఎస్పీలు ఉపేంద్రారెడ్డి, సాయికిరణ్, సీఐలు, ఎస్సైలు, సిబ్బందితో కలిసి ఆందోళనను కట్టడి చేశారు.
బీజేపీ కౌన్సిలర్‌కు అస్వస్థత
ఈ క్రమంలో బీజేపీ కౌన్సిలర్ సత్యవతి ఒక్కసారిగా స్పృహ కోల్పోవడంతో నాయకులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు ఇప్పటికై నా ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను చట్టబద్ధంగా నిర్వహించాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తామని ప్రకటించారు.
క్షణ క్షణం ఉత్కంఠ
ఓటింగ్ సమయంలో వివాదం..
చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నం సత్యంకు మద్దతుగా పలువురు కౌన్సిలర్లు చేతులెత్తి ఓటు వేశారు. అనంతరం బీజేపీ చైర్మన్ అభ్యర్థి అంకం మౌనికకు మరికొంత మంది చేతులెత్తి ఓటు వేశారు. ఈక్రమంలో ఎన్నికల అధికారి జీవరత్నం చైర్మన్ అభ్యర్థిగా అంకం మౌనికకు ఓటు వేసేవారు చేతులెత్తాలని కోరడంతో ఒక్కసారిగా వివాదం తలెత్తింది. ఎమ్మెల్యేతోపాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు గంటలు వివాదం కొనసాగింది. అధికారుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే కౌన్సిలర్లతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఏడుగురు మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు.
అధికార పార్టీ తీరుపై ఆగ్రహం..
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కనుసన్నల్లో జరగాల్సిన ఎన్నిక ప్రక్రియను సైతం అధికార పార్టీ ఎమ్మెల్యే అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీ భూక్య జాన్సన్ నాయక్ ఆరోపించారు. ఆయా పార్టీల కార్యకర్తలతో నాయకులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కౌన్సిలర్లతో కలిసి అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు వెంటనే చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు.


