ప్రొబేషనరీ ఐఎఫ్‌ఎస్‌ల పర్యటన
కడెం: కవ్వాల్ టైగర్‌జోన్ కోర్ ఏరియా నుంచి తరలించిన పాత మైసంపేట్‌ను, మండలంలోని ధర్మాజీపేట్ సమీపంలోని పునరావాస గ్రామన్ని నలుగురు ప్రొబేషనరీ ఐఎఫ్‌ఎస్‌లు మంగళవారం సందర్శించారు. శిక్షణలో భాగంగా రాంపూర్, మైసంపేట్ గ్రామాల తరలింపు, పునరావాసంలో భాగంగా గిరిజనులకు అందించిన ప్యాకేజీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పునరావాసంలో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త గ్రామంలో ఇళ్లు, కల్పించిన సౌకర్యాలు పరిశీలించారు. వీరి వెంట కడెం, ఉడుంపూర్ ఎఫ్‌ఆర్వోలు గీతారాణి, ప్రకాశ్, ఆటవీశాఖ సిబ్బంది ఉన్నారు.
వివరాలు తెలుసుకుంటున్న ప్రొబేషనరీ ఐఎఫ్‌ఎస్‌లు


