‘పోలీస్ టైగర్స్ ట్రోఫీ’ ప్రారంభం
నిర్మల్‌టౌన్: పోలీస్ సిబ్బందిలోని పని ఒత్తిడిని తగ్గించి శరీరాకంగా మానసికంగా ఉత్సాహం పెంచేందుకు ‘నిర్మల్ పోలీస్ టైగర్స్ ట్రోఫీ‘ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎస్పీ జానకీషర్మిల మంగళవారం పోటీలను ప్రారంభించారు. నిర్మల్ సబ్ డివిజన్, భైంసా సబ్ డివిజన్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు చెందిన మూడు పోలీస్ జట్లు ఇందులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉండటంతోపాటు, పరస్పర సమన్వయం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. విధి నిర్వహణతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ టోర్నమెంట్ రెండు రోజులు కొనసాగుతుందన్నారు. ఫైనల్ మ్యాచ్ బుధవారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, భైంసా ఏఎస్పీ రాజేశ్ మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, మూడు జట్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


