డిఫెన్సివ్ డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ
నిర్మల్‌చైన్‌గేట్: రోడ్డు ప్రమాదాల నివారణకు డిఫెన్సివ్ డ్రైవింగ్ ఏకై క మార్గమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు డీజీపీ శివధర్‌రెడ్డి ప్రతిపాదించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరై ‘అరైవ్ అలైవ్’ నినాదాలు రాసిన గాలిపటాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వాహనదారులు వేగ నియంత్రణ పాటించడంతో పాటు, రోడ్డుపై ప్రయాణించే ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు సాంకేతికతతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్ ఉత్సవాలు భేష్..
నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న నిర్మల్ ఉత్సవాలు బాగున్నాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసించారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, వినూత్నంగా ఏర్పాటు చేసిన సమాచారాత్మక స్టాళ్లు ఆకట్టుకుంటున్నాయన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణలో పాల్గొన్న అధికారులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యాటక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.


