నిర్మల్
న్యూస్‌రీల్
లారీలోని ఐరన్‌డోమ్‌ను ఢీకొన్న కారు ఘటన స్థలంలోనే నలుగురు మృతి భైంసాలో అర్ధరాత్రి.. మృత్యుఘోష..! మృతులది కుభీర్ మండలం కుప్టి ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ
మృత్యుంజయులు..
పూజలు చేసి.. పులకించి..
మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతరకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. మంగళవారం వేలసంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలుచేసి మొక్కులు చెల్లించుకున్నారు.
బాసరకు ‘వసంత’ శోభ
బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆల యం వసంత పంచమి వేడుకలకు ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 23వరకు అంగరంగ వై భవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు.
IIలోu
వసంత పంచమి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
బాసర: బాసరలో బుధవారం నుంచి మూడు రోజులపాటు వసంత పంచమి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ జానకీషర్మిల, భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఆలయ ఈవో అంజనాదేవితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూలైన్లు, గోదావరినది వద్ద పోలీసు భద్రత, సీసీ కెమెరాలు పరిశీలించారు, భక్తులకు ఇబ్బందులు, కలుగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కా కుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించా రు. ఆలయంలో వృద్ధులకు, అక్షరాభ్యాసం కో సం, సర్వదర్శనాని ఏర్పాటు చేసిన క్యూలైన్లను పరిశీలించారు. వీరివెంట సీఐ కిరణ్‌కుమార్ ఎస్సై నవనీత్‌రెడ్డి, ఆలయ సిబ్బంది ఉన్నారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలం కుప్టి గ్రామస్తులంతా ఒకే కుటుంబంలా వ్యవహరిస్తారు. గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా.. శుభకార్యమైనా గ్రామ పెద్దలు ముందుండి మంచీ చెడు చూసుకుంటారు. ఆ క్రమంలోనే గ్రామంలోని బాలుడు అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. గ్రామపెద్దలు, ఇటీవల ఎన్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్ కలిసి కారులో వెళ్లారు. బాలుడిని పరామర్శించి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. తిరిగి వస్తుండగా.. భైంసా పట్టణ శివారులోని సాత్‌పూల్ వంతెన వద్ద లారీలోని ఐరన్‌డోమ్ రూపంలో మృత్యువు దారికాచింది. చీకట్లో ఎదురుగా వస్తున్న లారీని దాటేసే క్రమంలో ఐరన్‌డోమ్‌ను ఢీకొట్టింది. కారు పైభాగం నుజ్జునుజ్జయింది. నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎడమవైపు ఉన్న ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన భైంసా పట్టణంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది.
– భైంసాటౌన్/కుభీర్
కుభీర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన బాలుడు సిద్ధార్థ్ అనారోగ్యంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని పరామర్శించేందుకు కుప్టి సర్పంచ్ పోతుగంటి గంగారాం, ఉపసర్పంచ్ గుండోల్ల శ్రీనివాస్(చిన్ను), భోస్లే భోజరాం పటేల్, కొడిమెల రాజన్న, బోయిడి బాబన్న, సిందే ఆనంద్‌రావు, కుభీర్‌కు చెందిన బొ ప్ప వికాస్ కారులో సోమవారం ఉదయం హైదరా బాద్ వెళ్లారు. బాలుడిని పరామర్శించి అతడి తల్లి దండ్రులకు ధైర్యంచెప్పారు. సాయంత్రం స్వగ్రామానికి బయల్దేరారు. అర్ధరాత్రి తర్వాత భైంసా– నిర్మల్ రహదారి మీదుగా భైంసా పట్టణ శివారులోని సాత్‌పూల్ వంతెన వద్దకు చేరుకున్నారు.
20 నిమిషాలయితే ఇంటికి..
మరో 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే గ్రామానికి చేరుకునేవారు. కానీ ఇరుకుగా ఉన్న సాత్‌పూల్ వంతెనపై ఎదురుగా లారీ ఓ పెద్ద ఐరన్ డోమ్‌తో నిర్మల్ వైపు నుంచి భైంసా వైపు వెళ్తోంది. చీకట్లో ఐరన్ డోమ్ కనిపించకపోవడంతో వీరి కారు వేగంగా వెళ్లింది. డోమ్ కారుకు తాకి.. కుడివైపు భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో డ్రైవర్ బొప్ప వికాస్(25)తోపాటు వెనుక సీట్లో ఉన్న భోస్లే భోజరాం పటేల్(40), కొడిమెల రాజన్న(58), బోయిడి బాబన్న(70) అక్కడికక్కడే మృతిచెందారు. ఐరన్ డోమ్‌కు ఎలాంటి సూచిక ఏర్పాటు చేయకుండా వెళ్లడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వంతెనపై వీధి దీపాలు కూడా వెలగకపోండం మరో కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
హుటాహుటిన సహాయక చర్యలు..
ప్రమాదం జరిగిన వెంటనే భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ సీఐ సాయికుమార్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తిగా నుజ్జునుజ్జయిన కారు నుంచి మృతదేహాలను వెలికి తీయించారు. ట్రాఫిక్ క్లియర్ చేశారు. స్థానికులు సైతం సహాయకచర్యల్లో పాల్గొన్నారు. మృతదేహాలను భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. సర్పంచ్ గంగారాంకు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు..
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, కుప్టి గ్రామస్తులు హుటాహుటిన భైంసా ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో వారి రోదనలు మిన్నంటాయి. ముధోల్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ జానకీషర్మిల మంగళవారం ఉదయం భైంసాకు చేరుకుని ప్రమాదస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసు, ఆర్టీఏ అధికారులను ఆదేశించారు.
ముగ్గురూ ఊరి పెద్దలు..
కుప్టి గ్రామానికి చెందిన భోజరాం పటేల్‌తోపాటు కొడిమెల రాజన్న, బోయిడి బాబన్న, సిందే ఆనంద్‌రావు గ్రామంలో పెద్ద మనుషులుగా వ్యవహరిస్తుంటారు. అనుకోని ప్రమాదం ముగ్గురినీ కబళించింది. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. భోజరాంపటేల్ గ్రామంలోనే ఉంటూ భైంసా పట్టణంలో వ్యాపారం చేసేవాడు. ఇతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కొడిమెల రాజన్న, బోయిడి బాబన్న గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఘోర రోడ్డు ప్రమాదం తమ ఇంటి పెద్దలలను బలిగొనడంతో ఆ కుటుంబాల రోదన వర్ణనాతీతం. ఇక తాజాగా సర్పంచ్‌గా ఎన్నికై న గంగారాం పేద కుటుంబానికి చెందినవారు. ఇటీవల గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో గ్రామపెద్దలు ముందుండి అతన్ని గెలిపించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేశారు.
పెళ్లి కావాల్సిన ఇంట..
కుభీర్‌కు చెందిన బొప్ప చంద్రబాయి–నాగలింగం దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడు వినోద్ ఆర్మీలో పనిచేస్తుండగా, మూడో కుమారుడు వివేక్ డిగ్రీ చదువుతున్నాడు. రెండో కుమారుడైన వికాస్‌మిషన్ భగీరథలో వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు ఖాళీ సమయంలో తన సొంతకారును అద్దెకు నడుపుతున్నాడు. సోమవారం కుప్టి గ్రామస్తులతో హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి వస్తుండగా రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో చావు మేళం మోగింది. పచ్చని పందిరితో కళకళలాడాల్సిన చోట విషాదం అలుముకుంది.
ఘటన స్థలంలో చెల్లాచెదురుగా మృతదేహాలు
ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కారులో ప్రయాణిస్తున్న సిందే ఆనంద్‌రావు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ముందు సీట్లో కూర్చున్న ఆనంద్‌రావు ఎయిర్‌బ్యాగ్ ఓపెన్ కావడంతో సురక్షితంగా బయటపడ్డారు. వెనుక సీటులో ఎడమవైపు కూర్చున్న శ్రీనివాస్‌కు కూడా ఎలాంటి గాయాలు కాలేదు.
నిర్మల్
నిర్మల్
నిర్మల్


