అభ్యసన సామర్థ్యాల సాధన
బొమ్మల ఆధారిత బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ పపెట్రీ ప్రదర్శనకు విద్యాశాఖాధికారుల ప్రశంసలు జిల్లా ఉపాధ్యాయుడి ప్రత్యేక ప్రతిభ
ఆట పాటలతో బోధన..
నిర్మల్‌ఖిల్లా: గ్రామీణ విద్యార్థుల అభ్యసనను సరళతరం చేస్తూ ఆటపాటలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో సాగుతున్న బోధనకు ప్రశంసలు దక్కా యి. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణలో జిల్లా జిల్లాఉపాధ్యాయుడు తన ప్రతిభతో అ క్కడివారిని ఆకట్టుకున్నారు. సర్కారుబడుల్లో చదువుతున్న విద్యార్థులు కృత్యాధార భోదనతో ఆశించి న అభ్యసన సామర్థ్యాలను సాధించే దిశగా పాఠశా ల విద్యాశాఖ ఇటువంటి కార్యక్రమాలను ఎస్సీఈ ఆర్టీ ఆధ్వర్యంలో చేపడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీ వేదికగా ఈ నె ల 19, 20 తేదీల్లో ’బొమ్మల ఆధారిత బోధన’ (టా య్ బేస్డ్ పెడగాజీ)పై రెండు రోజుల శిక్షణ పూర్తయింది. గణితం, సైన్స్, భాషల సబ్జెక్టులను ఆసక్తికరంగా బోధించే పద్ధతులు శిక్షకులకు నేర్పారు.
ఎల్లన్న పపెట్రీ ప్రదర్శన..
భైంసా మండలం వానల్‌పాడ్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మాదరి ఎల్లన్న రాష్ట్రస్థాయి శిక్షణ లో పాల్గొని, స్వయంగా తయారు చేసిన పపెట్రీ (తోలుబొమ్మలాట) నమూనా ప్రదర్శించారు. సంక్లిష్ట భావనలను ఆకర్షణీయంగా వివరించిన తీరు అధికారులు, నిపుణులు ప్రశంసించారు. 33 జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయుల మధ్య ఆయన ప్రదర్శన ఆకట్టుకుంది. ఎస్‌సీఈఆర్టీ ప్రొఫెసర్ తహసీన్ సుల్తానా, శ్రీనివాస్‌లతోపాటు అందరూ అభినందించారు.
బొమ్మల బోధన ప్రయోజనాలు
జిల్లా స్థాయిలో కొనసాగే కార్యక్రమాలు
నిర్మల్ జిల్లా నుంచి శిక్షణ పొందిన ఎల్లన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈనెల 23 నుంచి ఆదిలాబాద్ డైట్ కళాశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను విస్తరించి, విద్యార్థుల భవిష్యత్తును రూపొందిస్తాయి.


