వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. పగలు వేడిగానే ఉంటుంది. అర్ధరాత్రి తర్వాత చలి ప్రభావం మొదలవుతుంది. తెల్లవారుజామున అధికంగా ఉంటుంది.
గణతంత్ర వేడుకలు
ఘనంగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభిన వ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ స మావేశ మందిరంలో వివిధ శాఖల అధికా రులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను వివరించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వేడుకలకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. దేశభక్తిని ప్రతిబింబించేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రముఖులను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించాలని పా ర్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. వేడుకల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యేవారికి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, అధికారులు పాల్గొన్నారు.
రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష
నిర్మల్‌చైన్‌గేట్: రంజాన్ మాసంలో ముస్లింల ప్రార్థనల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు, ము స్లిం మత పెద్దలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రంజాన్ నెలలో మసీదుల వద్ద నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నా రు. ప్రార్థన వేళల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మసీదుల పరిసర ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని వివరించారు. మసీదుల పరిసర ప్రాంతాల్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటి వివరాలు తెలిపేందుకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామన్నారు. రంజాన్ పండుగ రోజు ఈద్గాలలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, షామియానాలు, ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, మైనారిటీ అధికారి మోహన్‌సింగ్, మత పెద్దలు పాల్గొన్నారు.


