ప్రభుత్వం దృష్టికి వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలు
● ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్ రూరల్: వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. తన నివాసంలో టీఎస్ పెటా నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వ్యాయామ విద్యను అందించి క్రీడానైపుణ్యాలు పెంచాలని సూచించారు. ఇందులో సంఘ జిల్లా అధ్యక్షుడు అంబాజీ, సెక్రెటరీ డేవిడ్ బెన్హర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారావు, వైస్ ప్రెసిడెంట్ రాంజీ, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, లక్ష్మణ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


