‘అధికారం’వైపే పల్లెలు
నిర్మల్: పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకు న్నా పోటీలో ఉన్న అభ్యర్థులు వివిధ పార్టీలకు చెందినవారే ఉంటారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థులు గా బరిలో దిగుతారు. జిల్లాలో గురువారం ముగిసి న తొలివిడత పంచాయతీ సమరంలో అధికార కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలి చారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం, జిల్లాలో ఇద్ద రు ఎమ్మెల్యేలున్న బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ఆ శించిన ఫలితాలు సాధించకున్నా.. పలు మండలా ల్లో సత్తా చాటారు. గత ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఈసా రి కొన్ని పంచాయతీలకు పరిమితమై ‘కారు’ ఉనికి ని చాటారు. పార్టీలకు ఎలాంటి సంబంధం లేకుండా బరిలో నిలిచిన స్వతంత్రులూ బీజేపీ, బీఆర్‌ఎస్ కంటే అధిక స్థానాల్లో గెలుపొందడం గమనార్హం.
ఖానాపూర్‌లో కాంగ్రెస్..
తొలివిడతలో ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖా నాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాలు న్నాయి. ఈ మండలాల్లో మొత్తం 91జీపీలుండగా, 45చోట్ల కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. నిర్మల్ నియోజకవర్గంలోని లక్ష్మణచాంద, మామడ మండలాల్లో కలిపి 45జీపీలుండగా, 24 చోట్ల హస్తం విజయకేతనం ఎగురవేసింది. తొలివిడతలో ఏకగ్రీవమైన 16స్థానాల్లోనూ 11మంది కాంగ్రెస్ బలపర్చిన స్థానాలే కావడం గమనార్హం.
రెండు మండలాల్లో బీజేపీ..
ఖానాపూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కలిపి కేవలం ఆరు జీపీలకే బీజేపీ బలపర్చిన అభ్యర్థులు పరిమితమయ్యారు. నిర్మల్ నియోజకవర్గ పరిధిలో మాత్రం కమలదళం చెప్పుకోతగ్గ ఫలితాలు సాధించింది. లక్ష్మణచాంద, మామడ మండలాల్లో 8 చొప్పున 16స్థానాల్లో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు.
ఉనికి చాటుకున్న బీఆర్‌ఎస్
గత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు క్లీన్‌స్వీప్ చేసిన బీఆర్‌ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత దయనీయస్థితికి చేరింది. ఖానాపూర్ నియోజకవర్గంలో అంతోఇంతో సత్తాచాటుకుంది. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ కలుపుకొని 18స్థానాల్లో గెలుపొందింది. మామడలో ఒకరు గెలవగా, లక్ష్మ ణచాందలో ఒక్కరూ గెలువలేదు.
మండలాలవారీగా పార్టీల మద్దతు, స్వతంత్రంగా విజేతలైనవారు
మండలం జీపీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్‌ఎస్ ఇతరులు
ఖానాపూర్ 25 07 02 06 10
కడెం 29 15 01 07 06
పెంబి 24 15 01 03 05
దస్తురాబాద్ 13 08 02 02 01
మామడ 27 17 08 01 01
లక్ష్మణచాంద 18 07 08 00 03
మొత్తం 136 69 22 19 26
‘అధికారం’వైపే పల్లెలు


