రెండో విడతకు రెడీ..
న్యూస్‌రీల్
నిర్మల్
హాకీలో మూడోస్థానం
అండర్–14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్‌లో జిల్లా క్రీడాకారులు మూడో స్థానంలో నిలి చారు. వనపర్తి వేదికగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచారు.
కుష్ఠురహిత జిల్లా లక్ష్యం
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాను కుష్ఠు రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో లెప్రసీ కేస్ డిటెక్షన్ కార్యక్రమంపై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ లెప్రసీ కేస్ డిటెక్షన్ కార్యక్రమం ఈనెల 18 నుంచి 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్స్ ప్రతీ ఇంటిని సందర్శించి ప్రతీ వ్యక్తిని పరీక్షించడం జరుగుతుందన్నారు. తద్వారా లెప్రసీని గుర్తించి వెంటనే చికిత్స అందించి, వ్యాధి వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, వ్యాధిపై ఉన్న అపోహలు తొలగించడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 14 ఏళ్ల బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్‌ను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నయానరెడ్డి, డాక్టర్ ప్రత్యూష, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఆకాశ్, ఆశిష్‌రెడ్డి, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, డీపీఎంవో రాజేశ్వర్, గంగన్న జిల్లాలోని వైద్యాధికారులు, పర్యవేక్ష సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక రెండో విడతలో నిర్మల్‌రూరల్, సోన్, దిలావర్‌పూర్, సారంగపూర్, నర్సాపూర్, లోకేశ్వరం, కుంటాల మండలాల్లో పోలింగ్ జరుగనుంది. ఏడు మండలాల్లో మొత్తం 131గ్రామ పంచాయతీలు, 1,170 వార్డులు ఉన్నాయి. రెండో విడతలో పది జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 121 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను శనివారం చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లో జిల్లా అధికారులు పోలింగ్ సామగ్రి పంపిణీ ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది ఎంపిక ప్రక్రియలను పూర్తిచేశారు. పోలింగ్ కేంద్రాలనూ సన్నద్ధం చేసిపెట్టారు.
ఆ ఊళ్లల్లో అంతా ఏకగ్రీవం..
రెండో విడతలో పదిగ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. సారంగపూర్ మండలం పెండల్‌దరి, మహవీర్‌తండా, రాంసింగ్‌తండా, సాయినగర్‌తండా, లోకేశ్వరం మండలంలోని బిలోలి, నర్సింహనగర్‌తండా, సేవాలాల్‌తండా, సోన్ మండలం లోకల్‌వెల్మ ల్ పంచాయతీల్లో సర్పంచ్‌లతోపాటు అన్నివార్డులూ ఏకగ్రీవం అయ్యాయి. సారంగపూర్ మండలంలోని స్వర్ణ(పొంకూర్), నిర్మల్‌రూరల్ మండలం తల్వేద గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 1,170 వార్డులకుగానూ 430 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 121 జీపీలు, 740 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
మండలాల వివరాలు..
మండలం జీపీలు వార్డులు ఓటర్లు
నిర్మల్‌రూరల్ 20 170 22,751
సోన్ 14 132 21,801
సారంగపూర్ 32 282 39,516
దిలావర్‌పూర్ 12 108 18,744
నర్సాపూర్(జి) 13 120 20,238
లోకేశ్వరం 25 224 29,359
కుంటాల 15 134 19,055
మొత్తం 131 1,170 1,17,464
పంపిణీకి సర్వం సిద్ధం..
ఎన్నికలు ప్రశాంతంగా పూర్తిచేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రెండోవిడత ఎన్నికల సిబ్బంది శనివారం ఉదయమే పంపిణీ కేంద్రాలలో రిపోర్టు చేసి, సంబంధిత పోలింగ్ సామగ్రిని వెంట తీసుకుని కేటాయించిన జీపీలకు వెళ్లాల్సి ఉంటుంది. నిర్మల్‌రూరల్ మండలానికి సంబంధించి ఎన్టీఆర్ మినీస్టేడియంలో, సోన్‌లో మండలపరిషత్ ఆవరణలో, సారంగపూర్‌లోని వ్యవసాయ మార్కెట్‌కమిటీలో, దిలావర్‌పూర్‌లో మండలపరిషత్ కార్యాలయంలో, నర్సాపూర్(జి)లో జెడ్పీహెచ్‌ఎస్‌లో, లోకేశ్వరంలో రైతువేదికలో, కుంటాలలో మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు శనివారం సాయంత్రం బయలుదేరి వెళ్లనున్నారు. సంబంధిత రవాణా ఏర్పాట్లనూ అధికారులు చేశారు.
మహిళలదే పైచేయి...
రెండోవిడత మండలాల్లోనూ మహిళ ఓటర్లదే పైచేయి. ఈవిడతలో మొత్తం 1,71,464 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 80,144 మంది ఉండగా, మహిళలు 91,316 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే 11,172 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. సారంగపూర్ మండలంలో అత్యధికంగా 32 జీపీలు, 282 వార్డులు ఉండగా, దిలావర్‌పూర్‌లో కేవలం 12 జీపీలు, 108 వార్డులు ఉన్నాయి.
రెండో విడతకు రెడీ..
రెండో విడతకు రెడీ..


