ప్రశాంతంగా నవోదయ పరీక్ష
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 1,552 మంది విద్యార్థులకు, 1278 మంది(82.3%) హాజరయ్యారు. 274 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాల, వాసవీ, విజయ హైస్కూల్, భైంసా పట్టణంలోని అల్పోర్స్, వేదం, వాసవీ పాఠశాలల్లో పరీక్ష నిర్వహించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ నవోదయ విద్యాలయానికి చెందిన అధ్యాపకులు సెంటర్ లెవల్ అబ్జర్వర్లుగా వ్యవహరించారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ పరమేశ్వర్ తనిఖీ చేశారు.


