ఎన్నికల నిర్వహణలో తప్పులు దొర్లొద్దు
నిర్మల్‌చైన్‌గేట్/లక్ష్మణచాంద: రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో, సోన్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం కలెక్టర్ తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడా రు. జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రా రంభించాలని, ప్రతీ రెండు గంటలకు పోలింగ్ శాతం నివేదికలు పంపాలని తెలిపారు. సిబ్బందికి భోజనం, తాగునీటి సౌకర్యాలను పరిశీలించా రు. ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, అధికారులు పాల్గొన్నారు.


