నేడు మలివిడత పోరు
ఏడు మండలాల్లో ఏర్పాట్లు పూర్తి 121 జీపీలు, 740 వార్డుల్లో ఎన్నికలు బరిలో 414 మంది సర్పంచ్ అభ్యర్థులు మధ్యాహ్నం వరకు పోలింగ్.. తర్వాత కౌంటింగ్
నిర్మల్: జిల్లాలోని ఏడు మండలాల్లో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల సి బ్బంది పంపిణీ కేంద్రాల నుంచి సామగ్రిని తీసుకు ని శనివారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రెండోవిడతనూ విజయవంతంగా పూర్తిచేయాలంటూ క లెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల సూచించారు. ఉన్నతాధికారులతోపాటు ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మస్రత్‌ఖానం సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మధ్యాహ్నం నుంచి ఫలితాలు..
రెండోవిడతలోనూ ఉదయం ఏడునుంచి ఒంటిగంట దాకా పోలింగ్, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తక్కువ వార్డులు, ఓటర్లు ఉన్న పంచాయతీల ఫలితాలు మధ్యాహ్నం 3 గంటల నుంచే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉపసర్పంచ్‌ల ఎన్నికనూ నిర్వహించి, పంచాయతీల పాలకవర్గాన్ని పోలింగ్ సిబ్బంది ప్రకటించనున్నారు. వార్డులు, ఓటర్లు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో రాత్రివరకూ కౌంటింగ్ కొనసాగనుంది.
గెలిచేదెవరో...
తొలివిడతతో పోలిస్తే.. రెండోవిడతపై రాజకీయపరంగా మరింత ఆసక్తి నెలకొంది. ఈ విడతలో నిర్మల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, ముధోల్‌లోని రెండు మండలాలు అలాగే రెండు నియోజకవర్గాల్లో పంచాయతీలు ఉన్న నర్సాపూర్(జి)ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉండటం, కాంగ్రెస్ శాయశక్తుల శ్రమించడంతో గెలుపు ఎవరు బలపర్చిన అభ్యర్థులను వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దిలావర్‌పూర్, గుండంపల్లి, సారంగపూర్, లోకేశ్వరం, కుంటాల, నర్సాపూర్(జి), సోన్ తదితర మేజర్ పంచాయతీల్లో పోటాపోటీ ఉండటమూ ఈవిడతపై రాజకీయ దృష్టిని పెంచింది. చాలాచోట్ల ఇద్దరు అభ్యర్థుల మధ్యనే పోటీ ఉండటంతో ఎవరు గెలుస్తురనేది ఉత్కంఠగా మారింది.
మండలం జీపీలు వార్డులు సర్పంచ్ వార్డు ఏకగ్రీవమైన మొత్తం
అభ్యర్థులు అభ్యర్థులు జీపీలు ఓటర్లు
నిర్మల్‌రూరల్ 20 170 63 313 01 22,751
సోన్ 14 132 47 219 01 21,801
సారంగపూర్ 32 282 93 365 05 39,516
దిలావర్‌పూర్ 12 108 39 142 –– 18,744
నర్సాపూర్(జి) 13 120 42 246 –– 20,238
లోకేశ్వరం 25 224 87 182 03 29,359
కుంటాల 15 134 43 239 –– 19,055
మొత్తం 131 1,170 414 1,706 10 1,17,464
నేడు మలివిడత పోరు
నేడు మలివిడత పోరు
నేడు మలివిడత పోరు


