బస్సు సౌకర్యం కల్పించాలి
బాసర: మండలంలోని కిర్గుల్ (కె)గ్రామానికి రెండుసార్లే బస్సు వస్తుందని.. ఆ తర్వాత రా వడం లేదని మహిళలు వాపోయారు. వివిధ పనులకు బాసరకు వెళ్లేవారు గన్నవరం, అష్ట, ముధోల్ మీదుగా వెళ్తూ ఇబ్బంది పడుతున్నారని, తమ గ్రామం నుంచి అదనపు ట్రిప్పులను నడిపించాలని కోరుతున్నారు.
పంచ పరివర్తనతో మెలగాలి
భైంసాటౌన్: సమాజంలో విద్యార్థులు పంచ పరివర్తన గుణాలతో నడుచుకోవావాలని శ్రీ సరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు నర్లపురి రవీందర్, విభాగ్ శైక్షనిక్ ప్రముఖ్ కలిమహంతి వేణుమాధవ్ అన్నారు. పట్టణంలోని కిసాన్‌గల్లి శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో గురువారం పంచ పరివర్తన్ ప్రబోధన్ కార్యక్రమం నిర్వహించగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దే శం చేశారు. కుటుంబప్రబోధన్, పర్యావరణం, స్వదేశీ, సామాజిక సమరసత, పౌరవిధులు త దితర అంశాలు వివరించారు. కుటుంబంలో రోజురోజుకు నైతిక విలువలు పడిపోతున్నాయని.. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సమ యం వెచ్చించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు రమేశ్ మాశెట్టివార్, ప్రధానాచార్యులు నామాల భోజన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బస్సు సౌకర్యం కల్పించాలి


