తొలి పోరు ముగిసింది
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో గురువారం నిర్వహించిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దస్తురాబాద్, కడెం, పెంబి, లక్ష్మణ చాంద, మామడ, ఖానాపూర్ మండలాల్లోని 119 సర్పంచ్, 591 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఆరు మండలాల పరిధిలో పోలింగ్ 80.42 శాతంగా నమోదైంది. అత్యధికంగా పెంబి మండలంలో 83.32 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆరు మండలాల పరిధిలో 1,20,630 మంది ఓటర్లుండగా 97,007 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుష ఓటర్లు 42,564, మహిళా ఓటర్లు 54,442 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళల ఓట్లు 86శాతం పోలయ్యాయి.


