బాసర ఆలయంలో ‘మహా’ భజన
బాసర: బాసర శ్రీజ్ఞానసరస్వతీదేవి ఆలయంలో మహారాష్ట్రకు చెందిన భక్తులు శుక్రవారం భజన కార్యక్రమం నిర్వహించారు. పర్బని, బిడ్ జిల్లాల ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీరామ స్మరణతోపాటు సరస్వతి అమ్మవారి శ్లోకాలను భజన చేశారు. కార్యక్రమంలో శివానంద మహారాజ్, అమూల్‌శాస్త్రి సంతోష్ శాస్త్రి, ఉద్భవిశాస్త్రి భక్తిభజన బృందం సభ్యులు పాల్గొన్నారు.
పాపహేశ్వరాలయంలో పూజలు..
బాసర: బాసర శ్రీపాపహేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు శివశ్రీ జంగం నాగేశప్ప, భక్తులు పాల్గొన్నారు.


